Magazines

కామన్(మెట్రో-ఆర్టీసీ) పాస్ లాంచ్

48 నిమిషాల క్రితం

comman pass
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం




నవతెలంగాణ-హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కామన్ పాస్(మెట్రో-ఆర్టీసీ)ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దగ్గర నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామన్ పాస్లను కొనుగోలు చేశారు.


రోజువారీ పాస్ ధర రూ.400, నెలవారీ పాస్ ధర రూ.8,500. కోర్ అర్బన్ రీజియన్ (కూర్) పరిధిలోని ప్రయాణికుల కోసం ఈ కామన్ పాస్‌‌ను తీసుకొచ్చారు. అన్ని మెట్రో స్టేషన్లలో ఈ కార్డును జారీ చేస్తారు. మొదటి సారి కార్డు తీసుకున్నప్పుడు రూ.100 సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేస్తారు. కార్డు తిరిగి ఇచ్చేస్తే ఆ రూ.100 వాపస్ ఇస్తరు. ఔటర్ రింగ్ రోడ్ లోపల నడిచే అన్ని రకాల ఆర్టీసీ సిటీ బస్సులు (పుష్పక్ ఏసీ మినహా), మూడు కారిడార్లలోని మెట్రో రైళ్లలో ఈ పాస్‌‌ పని చేస్తుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్