నవతెలంగాణ - హైదరాబాద్: ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని నాయినీ నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని పార్సిగుట్టకు చెందిన మనోజ్ శివంరోడ్డులోని ఓ డయాగ్నోస్టిక్ సెంటర్లో పనిచేస్తున్నాడని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు సూసైడ్ నోట్లో మనోజ్ పేర్కొన్నాడనీ పోలీసులు చెప్పారు. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
స్టీల్బ్రిడ్జిపై నుంచి దూకి యువకుడు ఆత్మహత్య..
18 సెప్టెంబర్, 2026

Shiva Kumar
ప్రచురించబడింది సెప్టెం 18, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)