Tuesday, June 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్12 ఏండ్ల బీజేపీ పాలన కార్పొరేట్లకు పండగ, సామాన్య ప్రజలకు దండగ!

12 ఏండ్ల బీజేపీ పాలన కార్పొరేట్లకు పండగ, సామాన్య ప్రజలకు దండగ!

- Advertisement -

కల్లూరి మల్లేశం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
నవతెలంగాణ-ఆలేరు రూరల్

దేశంలో గత 12 ఏళ్లుగా కొనసాగుతున్న బీజేపీ పాలన కార్పొరేట్ సంస్థలకు పండగలా మారగా, సామాన్య ప్రజలకు దండగగా పరిణమించిందని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం విమర్శించారు. ఆలేరు పట్టణంలో “12 ఏండ్ల బీజేపీ పాలన – పరిశీలన” అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.12 ఏళ్ల బీజేపీ పాలనలో కార్పొరేట్లకు రూ.16 లక్షల కోట్ల రుణమాఫీ, పన్నుల మినహాయింపులు ఇచ్చి వారికి రోజు పండుగ చేశారని, కానీ సామాన్య ప్రజలపై జీఎస్టీ పరోక్ష పన్నుల రూపంలో నేటికి 24 లక్షల కోట్ల భారం మోపడంతో వారి బతుకులు దండగ చేశారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో రూ.15 లక్షలు జమ చేస్తానని, జనరల్ ఖాతా తీయమని మోసం చేశాడని, నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశారని, కరోనా సమయంలో సరైన ప్రణాళికలు లేక ఐదు లక్షల మంది చనిపోవడానికి, ప్రజల కష్టాలకు ఈ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఆరోపించారు.

అంతేకాకుండా, కార్మికుల హక్కులను హరించే విధంగా నాలుగు లేబర్ కోడ్‌లను తెచ్చి కార్మికుల హక్కుల పోరాటం కోసం కార్మిక సంఘాల ఏర్పాటును ప్రశ్నార్థకం చేస్తూ కార్మికుల హక్కులను కాల రాశాడని, రైతుల నడ్డి విరిచేలా వ్యవసాయ వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకురావడం ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పరాకాష్ట అని విమర్శించారు. నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతూ.. నీట్, యూజీసీ-నెట్ తో సహా దేశంలో వివిధ పరీక్షల ప్రశ్నాపత్రాలు పదే పదే లీకవుతుండటం ఈ ప్రభుత్వ వైఫల్యానికి కారణమని చెప్పారు. మణిపూర్లో మహిళలని నగ్నంగా ఊరేగించిన ఘటనలో ప్రధాని మోడీ నోరు మెదపకపోవడం అత్యంత దారుణమని, ఇది దేశానికి అవమానకరం అని ఆక్షేపించారు.

బిజెపి విధానాలు ప్రశ్నించే వాళ్ళని దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారని ప్రజల ఆరపలవాట్ల పైన దాడి చేసి చంపారని ప్రశ్నించిన వారిని గౌరీ లంకేష్ కాల్ బుర్గి అరవింద్ పాఠశాల ఎలాంటి వారిని అంతమందించారని, బిజెపి 12 ఏళ్ల పాలనలో దేశంలో ఉన్న రూ.55 లక్షల కోట్ల అప్పు రూ.200 లక్షల కోట్లకు చేరిందన్నారు. దేశ అప్పు పెరిగింది తప్ప.. ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. అంతేకాకుండా 2014లో బిజెపి అధికారంలోకి వచ్చినప్పుడు రూ.400 గ్యాస్ బండ ధర ఈరోజు వెయ్యి రూపాయలు దాటిందని, రూ.60 ఉన్న పెట్రోలు ధర రూ.115 దాటించడంలో కార్పొరేట్ కంపెనీల జేబులు నింపడంలో బిజెపి నాయకత్వం పోటీ పడుతుందని అన్నారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ఇన్సూరెన్స్ కంపెనీగా పేరుపొందిన ఎల్ఐసి ని ప్రైవేట్ పరం చేయడం, రైల్వేలను ప్రైవేటు పరం చేయడం, దేశ సంపదను ఆర్ఎస్ఎస్ కనుసన్నలలో బడా పెట్టుదారులకు లాభం చేకూర్చడంలో 12 సంవత్సరాల బిజెపి పరిపాలన పరాకాష్టకు చేరిందని అన్నారు.

60 సంవత్సరాల కాలంలో దేశంలోని అందరి ప్రధాన మంత్రులు చేసిన అప్పు రూ.55 లక్షల కోట్లు అయితే.. మన ప్రధానమంత్రి విశ్వ గురువు ఈ 12 ఏళ్ల కాలంలోనే మూడు రేట్లు పెంచారని, అది ప్రత్యక్షంగా కార్పొరేట్ల జేబుల్లోకి వెళ్ళిందని అన్నారు. దేశ ప్రజలకు మౌలిక వసతులు అదనంగా కల్పించ లేదని, దేశ ప్రజల ఆర్థిక స్థితి మెరుగు పడలేదని, అలాంటప్పుడు లక్షల కోట్ల చేసిన అప్పు ఏమైందో నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజల ముందు ఉంచాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దూపటి వెంకటేష్, సిఐటియు జిల్లా నాయకులు మొరిగాడి రమేష్, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎంఏ ఇక్బాల్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ మొరిగాడి చంద్రశేఖర్, సీపీఐ(ఎం) పట్టణ మండల నాయకులు వడ్డేమాన్ బాలరాజు, గనగాని మల్లేష్, తాళ్లపల్లి గణేష్, సంఘీ రాజు, మోరిగాడి అజయ్, చౌడబోయిన అంజయ్య, మిట్ట శంకరయ్య, చెన్న రాజేష్, నాయకులు కటకం సుదర్శన్, కొరుటూరు ఉపేందర్, గొడుగు దాసు, రేగోటి ప్రశాంత్, మహిళా సంఘం నాయకులు మోరీగాడి స్వరూప,అయిలీ చంద్రకళ, ఘనగాని భాగ్యమ్మ, మోరీగాడి అనిత, మోరిగాడి మంజుల, ఐలి అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -