Wednesday, July 15, 2026
E-PAPER
Homeఖమ్మంభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 52.79 శాతం డిజిటలైజేషన్ పూర్తి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 52.79 శాతం డిజిటలైజేషన్ పూర్తి

- Advertisement -

– అశ్వారావుపేట మండలం 44.25 శాతం తో జిల్లా సగటు కంటే వెనుకంజ
– జూలై 15 ఉదయం 10 గంటల నాటికి 22,587 ఫారాలు డిజిట్లైజ్ 
నవతెలంగాణ – అశ్వారావుపేట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్ – 2026) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిట్లైజేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. జూలై 15 ఉదయం 10 గంటల నాటికి జిల్లాలో మొత్తం 9,96,198 ఎన్యూమరేషన్ ఫారాల్లో 5,25,940 ఫారాలు డిజిట్లైజ్ చేయగా, ఇది 52.79 శాతం నమోదైంది. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య 22,587 ఫారాలు డిజిట్లైజ్ చేసినట్లు జిల్లా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

అశ్వారావుపేట మండలంలో మొత్తం 47,382 ఫారాల్లో 20,966 ఫారాలు డిజిట్లైజ్ చేయగా, 44.25 శాతం మాత్రమే పూర్తి కావడంతో జిల్లా సగటు కంటే వెనుకబడి ఉన్నట్లు తెలుస్తోంది. మణుగూరు (36.51%), దమ్మపేట (37.62%) తర్వాత తక్కువ పురోగతి నమోదైన మండలాల్లో అశ్వారావుపేట ఒకటిగా నిలిచింది.

జిల్లాలో అత్యధికంగా వాజేడు మండలం 76.57 శాతం తో మొదటి స్థానంలో ఉండగా, చండ్రుగొండ (71.91%), కామేపల్లి (67.17%), దుమ్ముగూడెం (66.84%), సుజాత నగర్ (62.30%) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు మణుగూరు (36.51%), దమ్మపేట (37.62%), అశ్వారావుపేట (44.25%), ఇల్లందు మున్సిపాలిటీ (44.35%) .పలు మండలాల్లో డిజిటైజేషన్ పురోగతి నెమ్మదిగా కొనసాగుతోంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -