నవతెలంగాణ-టేకుమట్ల
జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ర్యాలయంలో ఇటీవల భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఎన్నికైన బట్టు కరుణాకర్ ను టేకుమట్ల మండలంలోని కాంగ్రెస్ నాయకులు ఘనంగా శాలువాతో సన్మానించారు. గురువారం జిల్లా నాయకులు మాతృశ్రీ ఫౌండేషన్ చైర్మన్ దొంతల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేసి, చిత్రపటాన్ని బహుకరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టేకుమట్ల మండల ప్రధాన కార్యదర్శి దాసారపు సదానందం,చిట్యాల ఎస్సీ సెల్ అధ్యక్షులు బోట్ల రవి,పెద్దంపల్లి కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు,మధుకర్,అనవేన మొగిలి, కిరణ్ గౌడ్ పాల్గొన్నారు.
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బట్టు కరుణాకర్ కు ఘన సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



