Monday, May 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకరెంటు మెరుపుతో వరి చేను దగ్ధం..రైతుకు రూ.50 వేల నష్టం

కరెంటు మెరుపుతో వరి చేను దగ్ధం..రైతుకు రూ.50 వేల నష్టం

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్ : ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలో కరెంటు మెరుపు కారణంగా వరి చేను దగ్ధమై రైతుకు భారీ నష్టం వాటిల్లింది.గ్రామానికి చెందిన రైతు గంగరాజు రామకృష్ణకు చెందిన వరి పంట ఒక్కసారిగా మంటలకు ఆహుతై సుమారు 50 బస్తాల దిగుబడి నష్టం జరిగినట్లు తెలిపారు.ఈ ఘటనతో రైతుకు దాదాపు రూ.50 వేల మేర ఆర్థిక నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.పంట నష్టం కారణంగా తీవ్ర ఆవేదనకు గురైన రైతు గంగరాజు రామకృష్ణ కన్నీళ్లతో తన బాధను వ్యక్తం చేశారు.ఇప్పటికే వ్యవసాయ ఖర్చులు పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ ప్రమాదం మరింత కష్టాల్లోకి నెట్టిందని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఘటనపై అధికారులు పరిశీలన జరిపి తగిన నష్టపరిహారం అందించాలని కోరారు.స్థానిక రైతులు కూడా బాధిత రైతుకు ప్రభుత్వం అండగా నిలిచి నష్టపరిహారం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కరెంటు మెరుపుల వల్ల పంటలకు నష్టం జరగకుండా సంబంధిత శాఖలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -