– ఆల్ ఇండియా స్థాయిలో 5407 ర్యాంకు
– ఐఐటీలో ప్రవేశానికి అర్హత
నవతెలంగాణ – నాచారం
నాచారం ప్రాంతానికి చెందిన విద్యార్థి నల్లా కాన్షి రామ్ జేఈఈ అడ్వాన్స్‌డ్-2026 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ప్రతిభ కనబరిచారు.దేశంలో ని అత్యున్నత సాంకేతిక విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు)లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షలో ఆయన ఆల్ ఇండియా స్థాయిలో 5407వ ర్యాంకును సాధించారు.దేశవ్యాప్తంగా సుమారు 1.90 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరుకాగా, కాన్షి రామ్ తన కృషి, పట్టుదలతో మంచి ర్యాంకును సొంతం చేసుకున్నారు.
అంతకుముందు నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షలో 92 పర్సంటైల్ సాధించి అడ్వాన్స్‌డ్‌కు అర్హత పొందారు.తన విజయానికి కళాశాల అధ్యాపకులు, కోచింగ్ సంస్థ ఉపాధ్యాయులు, తల్లి దండ్రులు నల్లా రాధాకృష్ణ, చీరాల అన్నపూర్ణల ప్రోత్సాహం, సహకారం ఎంతో దోహదపడిందని కాన్షి రామ్ తెలిపారు. భవిష్యత్తులో ఉత్తమ ఇంజనీర్‌గా ఎదిగి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.కాన్షి రామ్ సాధించిన ఈ విజయం పై స్థానిక ప్రజలు, విద్యా వేత్తలు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలియజేశారు. నాచారం ప్రాంతానికి చెందిన విద్యార్థి జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం స్థానికులకు గర్వకారణంగా మారింది.



