Monday, June 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతురాజు పవన్

పరకాల మున్సిపల్ కమిషనర్‌గా పోతురాజు పవన్

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
పరకాల పురపాలక సంఘం కార్యాలయంలో నూతన మున్సిపల్ కమిషనర్‌గా పోతురాజు పవన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యాలయ సిబ్బంది, పట్టణ ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన కార్యాలయ సిబ్బందితో సమావేశమై, మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రాథమికంగా ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడమే తన ప్రథమ ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొని ఆయనకు అభినందనలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -