ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ
పారిస్ : ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లోకి 22వ సీడ్,రష్యాకు చెందిన కలిన్స్కియా, 25వ సీడ్ షణైదర్ ప్రవేశించారు.సోమవారం జరిగిన ప్రి క్వార్టర్ ఫైనల్లో కలిన్స్కియా 6-4, 2-6, 7-6(10-7)తో28వ సీడ్,ఆస్ట్రియాకు చెందిన పొటపొవాను చిత్తుచేసింది.తొలి సెట్ ను సునాయాసంగా నెగ్గిన రెండో సెట్ లో ఓటమిపాలైంది.నిర్ణయాత్మక మూడో,చివరి సెట్ లో టై బ్రేకర్ లో 10-7తో ముగించి మ్యాచ్ ను సొంతం చేసుకుంది.మరో ప్రి క్వార్టర్స్ లో 25వ షణైదర్ 6-3, 3-6, 6-0తో19వ సీడ్,కీస్(అమెరికా)ను ఓడించింది.ఇక పోలండ్ కు చెందిన చ్వాలిన్స్కా6-3, 6-2తో వరుససెట్లలో డి.పారీ(ఫ్రాన్స్)ను చిత్తుచేసి క్వార్టర్స్ కు చేరింది.బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో కలిన్స్కయా అన్ సీడెడ్ చ్వాలిన్కాతో తలపడనుంది.ఇక పురుషుల సింగిల్స్ లో క్వార్టర్ ఫైనల్లోకి 10వ సీడ్,ఇటలీకి చెందిన కోబొలి, 28వ సీడ్,బ్రెజిల్ కు చెందిన ఫోన్సెకా ప్రవేశించారు.సోమవారం జరిగిన తొలి ప్రి క్వార్టర్స్ లో కోబలి 6-2, 6-3, 6-7(3-7), 7-6(7-5)తో అన్ సీడెడ్ స్వజ్జా(అమెరికా)ను చిత్తుచేయగా..ఫోన్సెకా7-5, 7-6(10-8), 5-6, 6-2తో15వ సీడ్ రూఢ్(నార్వే)ను ఓడించి క్వార్టర్స్ కు చేరాడు.
శ్రీరామ్ బాలాజీ జంట ముందుకు
పురుషుల డబుల్స్ లో శ్రీరామ్ బాలాజీ,డెమోలినర్(బ్రెజిల్)జంట క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.సోమవారం జరిగిన మూడోరౌండ్ పోటీలో బాలాజీ-డెమోలినర్ జంట 7-5, 6-4తో6వ సీడ్,జర్మనీకి చెందిన షట్జ్-క్రావిట్జ్ ను ఓడించారు.క్వార్టర్ ఫైనల్లో భారత్-బ్రెజిల్ జంట 2వ సీడ్ పాటెన్(బ్రిటన్)-హెలియోవారా(ఫిన్లాండ్)జంటతో తలపడనున్నారు.



