Tuesday, June 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సిసి నాగరాజుపై విఓఎలు కలెక్టర్ కు ఫిర్యాదు.

సిసి నాగరాజుపై విఓఎలు కలెక్టర్ కు ఫిర్యాదు.

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు:-
మండలం కొయ్యుర్ లోని శ్రీలక్ష్మీ మండల సమాఖ్య కార్యాలయం పరిధిలో పావని క్లస్టర్ లో సిసిగా విధులు నిర్వహిస్తున్న చొప్పరి నాగరాజుపై విఓఎలు అక్కల ప్రమీల, కమ్మల రాజయ్య, మెట్టు జ్యోతి, ఎడ్ల సరితా సోమవారం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు ప్రజావాణిలో పిర్యాదు చేసినట్లుగా తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడారు ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట్ర, జిల్లా కమిటీ ఆదేశాలతో ఈ నెల 18 నుంచి శాoతియుతంగా నిరవధిక సమ్మె చేస్తున్న నేపథ్యంలో సిసి నాగరాజు ఆదివారం ప్రమీలకు ఫోన్ చేసి సమ్మె విరమించాలని,లేదంటే,సమ్మె పూర్తియ్యాక మీ సంగతి చెబుతానని బెదిరింపులకు గురిచేసినట్లుగా వాపోయారు. ఇతనికి విఓఏలు అంటే చిన్నచూపని, గతంలో కూడా పలువురు విఓఏలపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లుగా తెలిపారు.ఉన్నతాధికారులు స్పందించి అతనిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -