Tuesday, June 2, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంక్షిపణి దాడులకు ఇరాన్ సిద్ధం

క్షిపణి దాడులకు ఇరాన్ సిద్ధం

- Advertisement -

తెరుచుకుంటున్న భూగర్భ స్థావరాలు
టెహ్రాన్ : భూగర్భంలో ఉన్న తన ఆయుధాగారాలను త్వరితగతిన తవ్వి తీసి ఇజ్రాయిల్, ఇతర మధ్యప్రాచ్య దేశాలపై మరిన్ని దూర శ్రేణి క్షిపణులను ప్రయోగించేందుకు ఇరాన్ సన్నాహాలు చేస్తోంది. యుద్ధంలో అమెరికా, ఇజ్రాయిల్ సేనలు ఇరాన్ రహదారులను ధ్వంసం చేశాయి. క్షిపణి స్థావరాల ప్రవేశ ద్వారాలను మÖసివేశాయి. దీంతో ఇరాన్ తన భూగర్భ క్షిపణి స్థావరాలను చేరుకోలేకపోయింది. కానీ బుల్డోజర్లు, డంప్ ట్రక్కులు వంటి సాధారణ పరికరాల సాయంతోనే అమెరికాఇజ్రాయిల్ దాడులను తిప్పికొట్టగలిగింది. క్షిపణి స్థావరాలకు చెందిన సొరంగాల ప్రవేశ మార్గాలను లక్ష్యంగా చేసుకు న్నంత మాత్రాన ఇరాన్ క్షిపణి సామ ర్ధ్యాన్ని దెబ్బతీయడం సాధ్యం కాదని శుత్రు సేనలకు తెలిసివచ్చింది. ఒకవేళ తిరిగి ఘర్షణలు ప్రారంభమైతే లాంఛర్లు, సిబ్బంది సాయంతో ఇరాన్ క్షిపణులను ప్రయోగించగలదని విశ్లేషకులు తెలిపారు. యుద్ధం కారణంగా ఉత్పత్తి నిలిచిపోయినప్పటికీ ఇరాన్ వద్ద ఇప్పటికీ అపారమైన క్షిపణి నిల్వలు ఉన్నాయి. ఇరాన్‌లోని డెజ్‌ఫుల్‌లో ఓ క్షిపణి స్థావరం ఉంది. దీనికి ఐదు ప్రవేశ ద్వారాలు ఉండగా వాటిలో నాలుగు ద్వారాలు మే 12న తెరుచుకున్నాయి. మూసుకుపోయిన ప్రవేశ ద్వారాలను తెరిచేందుకు ఇరాన్ దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ఈ ప్రయత్నాలు మరింత వేగవంతమయ్యాయి.

యుద్ధ సమయంలో ఇరాన్‌లోని 18 భూగర్భ క్షిపణి స్థావరాలకు చెందిన 69 టన్నెల్ ప్రవేశ ద్వారాలపై అమెరికాఇజ్రాయిల్ సేనలు దాడి చేసి వాటిని మూసివేశాయి. వాటిలో ఇప్పటి వరకూ యాభై ద్వారాలను ఇరాన్ తిరిగి తెరవగలిగింది.క్షిపణి స్థావరాలలో కొన్ని మరమ్మతు పనులను కూడా ఇరాన్ పూర్తి చేసింది. రోడ్లను పునర్నిర్మించింది. వాస్తవానికి ఇరాన్ 20 సంవత్సరాల క్రితమే భూగర్భ క్షిపణి స్థావరాల నిర్మాణాన్ని ప్రారంభిం చింది. తన క్షిపణులు, లాంఛర్లకు పటిష్టమైన రక్షణ కల్పించింది. వందలాది మీటర్ల రాతి ప్రాంతం కింద నిర్మించిన ఈ స్థావరాలపై దాడులు చేయడం అసాధ్యం. అయితే యుద్ధ సమయంలో స్థావరాల ప్రవేశ ద్వారాలను అమెరికా, ఇజ్రాయిల్ సేనలు ధ్వంసం చేయగలిగాయి. దీంతో వాటికి కొంతమేర నష్టం జరిగింది. అనేక టన్నెల్ ప్రవేశ ద్వారాలను పర్వత శకలాలు కప్పేశాయి. స్థావరాలకు దారితీసే రోడ్లు ధ్వంసమయ్యాయి. కీలక ఇస్ఫహాన్ ఉత్తర క్షిపణి స్థావరంపై అనేక పర్యాయాలు దాడులు జరిగాయి. క్షిపణుల తయారీకి అవసరమైన విడి భాగాలు ఫ్యాక్టరీల నుంచి చేరకుండా అమెరికా, ఇజ్రాయిల్ దళాలు అడ్డు కున్నాయి. అయినప్పటికీ ఇరాన్ భూగర్భ స్థావరాలలో ఇప్పటికీ వెయ్యి క్షిపణులు నిల్వ ఉన్నాయని నిపుణులు అంచనా వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -