Tuesday, June 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాల్లో నారాయణ టాప్

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాల్లో నారాయణ టాప్

- Advertisement -

ఆలిండియా టాప్ 20లో 6 ర్యాంకులతో అగ్రగామిగా..
ఓపెన్ కేటగిరీలో ఆలిండియా టాప్ 50 లోపు 14 ర్యాంకులు నారాయణవే
టాప్ 100 లో 35 ర్యాంకులతో జేఈఈ అడ్వాన్స్‌డ్ లీడర్‌గా నారాయణ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జేఈఈ-అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాలలో నారాయణ విద్యార్థులు టాప్ ర్యాంకులతో మరోసారి సత్తాచాటారు. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో కుచి సందీప్ (హాల్ టికెట్ నెంబర్ : 266121063) 5వ ర్యాంక్, మను పరమేశ్వరన్ (హెచ్.టి.నెం : 261049023) 13వ ర్యాంక్, ప్రిన్స్ చౌదరి (హెచ్.టి.నెం : 262092058) 14 వ ర్యాంక్, వెల్లురి హార్షిత్ (హెచ్.టి.నెం : 266053091) 15వ ర్యాంక్, తనయ్ అగర్వాల్ (హెచ్.టి.నెం : 262078257) 16వ ర్యాంక్, అనీష్ ముప్పాల (హెచ్.టి.నెం : 266131526) 20వ ర్యాంక్‌తో టాప్ 20 ర్యాంకుల్లో 6 ర్యాంకులు నారాయణ కైవసం చేసుకుంది. అలాగే ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 22, 23, 24, 27, 35, 39, 41, 44, 51, 54, 57, 58, 60, 61, 63, 71, 72, 75, 78, 79, 80, 83, 84, 89, 98,99, 100 వంటి టాప్ 100 లోపు 35 ర్యాంకులు, 500 లోపు 133 ర్యాంకులు,1000 లోపు 217 ర్యాంకులు నారాయణ విద్యార్థులు కైవసం చేసుకున్నారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్స్ డాక్టర్ పి. సింధూరనారాయణ, పి.శరణి నారాయణ తెలిపారు. అలాగే ఆలిండియా అన్ని కేటగిరీల్లో 2, 4, 5, 6, 6, 7, 9 వంటి 10 లోపు 16 ర్యాంకులు, 50 లోపు 69 ర్యాంకులు, 100 లోపు 147, 500 లోపు 540, 100 లోపు 894 ర్యాంకులను కైవసం చేసుకుని ఐఐటీ ఆశయాలను సాకారం చేయటంలో వేరెవ్వరూ నారాయణకు సాటిలేరనీ, సాటిరారని నిరూపించిందన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 1,90,000 మందికి పైగా విద్యార్థులు పోటీపడిన ఈ పరీక్షా ఫలితాల్లో అత్యధిక సంఖ్యలో నారాయణ విద్యార్థులు విజయంందుఢి మోగించారని తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్ పి.సింధూర నారయణ మాట్లాడుతూ ఈ అద్భుతమైన విజయానికి కుచి సందీప్ నాయకత్వం వహించాడని తెలిపారు. కుచి సందీప్ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 5 వ ర్యాంక్ సాధించాడన్నారు. హైదరాబాద్‌కు చెందిన సందీప్, నారాయణ స్కూల్స్‌లో 10వ తరగతి, నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివినట్టు చెప్పారు. అతను ఒలింపియాడ్ స్వర్ణ పతక విజేత కూడా. అంతర్జాతీయ రసాయన శాస్త్ర ఒలింపియాడ్ (IChO) 2025లో స్వర్ణ పతకం గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచాడు. ఉజ్బెకిస్తాన్‌లో జరగనున్న అంతర్జాతీయ రసాయన శాస్త్ర ఒలింపియాడ్ 2026లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి మరోసారి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. నారాయణలో అనితరసాధ్యమైన శిక్షణ, రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్‌లు, మైక్రో షెడ్యూల్, బెస్ట్ స్టడీమెటీరియల్, ఇంటర్నల్ ఎగ్జామ్స్, ర్యాంకింగ్ సిస్టమ్, టాప్ ఫ్యాకల్టీతోనే ఇంతటి ఘనవిజయానికి కారణాలని తెలిపారు. 8వ తరగతి నుంచే జేఈఈకి అవసరమైన శిక్షణ అందించటంతోపాటు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్టు వివరించారు. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ నాణ్యమైన విద్యను అందిస్తున్నట్టు చెప్పారు. పరీక్షల్లో ఎలాంటి క్లిష్టమైన ప్రశ్నలు వచ్చిన తక్కువ సమయంలో సరైన సమాధానం గుర్తించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామన్నారు. డైరెక్టర్ శరణి నారాయణ మాట్లాడుతూ ఎన్-లెర్న్ యాప్ ద్వారా ఛాప్టర్ వైజ్ ప్రాక్టీస్ టెస్ట్‌లు, ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లు నిర్వహించటం వల్లనే నారాయణ విద్యార్థులు ఇంతటి ప్రతిభా పాటవాలను ప్రదర్శించగలిగారని తెలిపారు. ఈ విధానాల వల్లే తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధిక విద్యార్థులు, జాతీయ స్థాయిలో నారాయణ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఐఐటీల్లోకి ప్రవేశిస్తున్నట్టు వెల్లడించారు. టాప్ ర్యాంకులు సాధించిన వారికి అత్యధిక సంఖ్యలో నారాయణ స్కూల్స్‌లో చదివిన విద్యార్థులే ఉన్నారన్నారు. ఇంతటి ఘనవిజయం సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపక, అధ్యాపకేతర బృందానికి నారాయణ విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పునీత్ కొత్తపల్లి అభినందనలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -