Sunday, June 7, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంభారత్‌లో అసమ్మతి, బొద్దింక వ్యాఖ్యపై లండన్‌లో సీజేఐకి ప్రశ్నలు

భారత్‌లో అసమ్మతి, బొద్దింక వ్యాఖ్యపై లండన్‌లో సీజేఐకి ప్రశ్నలు

- Advertisement -

అనుమతించని నిర్వాహకులు
లండన్ :
లండన్ విశ్వవిద్యాలయంలోని బిర్క్‌బెక్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ ఇచ్చిన ఉపన్యాస కార్యక్రమంలో వివాదం చెలరేగింది. భారత్‌లో అసమ్మతి గళాలపై వ్యతిరేకత, సీజేఐ ఇటీవల చేసిన ‘బొద్దింక’ వ్యాఖ్యకు సంబంధించి కార్యక్రమానికి హాజరైన వారు ఆయనను ప్రశ్నించారు. దీంతో ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి అంతరాయం ఏర్పడింది. ఈ నెల 4న బిర్క్‌బెక్‌లో ’కృత్రిమ మేధ-అంతర్జాతీయ చట్టం’ అనే అంశంపై సూర్యకాంత్ ఉపన్యసించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇంటరాక్టివ్ సెషన్ సందర్భంగా ఆహుతులలో ఒకరు భారత ప్రజాస్వామ్య రికార్డు, అసమ్మతిపై పెరుగుతున్న వ్యతిరేకతపై సీజేఐని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న వీడియో క్లిప్పింగులలో ఆ వ్యక్తి ఏమన్నా డంటే…‘భారత్‌లో అసమ్మతి పట్ల పెరుగుతున్న వ్యతిరేకత గురించి దేశంలోనూ, అంతర్జాత ీయంగానూ పలువురు న్యాయ పరిశీలకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మేము ఇప్పుడు వింటున్నాము.
ఈ వ్యతిరేకత గౌరవ న్యాయ మూర్తి ప్రసంగంలో కొంత వరకూ ప్రతిబింబించినట్లు కన్పించింది. ఈ వ్యతిరేక ధోరణిపై విస్తృతంగా ప్రచారం జరిగింది.

గత నెల 15వ తేదీన సీజేఐ సుప్రీంకోర్టులో చేసిన వ్యాఖ్యలు, వాటిపై దేశంలో జరిగిన చర్చ గురించి సమావేశానికి హాజరైన మరో వ్యక్తి ఆయనను ప్రశ్నించేందుకు ప్రయత్నించారు. అయితే మోడరేటర్ ఆయనను అడ్డుకున్నారు. అలాంటి ప్రశ్నలను అనుమతించేందుకు నిరాకరించారు. సభికులు లేవనెత్తుతున్న ప్రశ్నలు కృత్రిమ మేధ – అంతర్జాతీయ చట్టానికి సంబంధిం చినవి కావు కాబట్టి వాటిని అనుమతించలేనని స్పష్టం చేశారు. ఆ సమయంలో కొంతమంది లేచి నిలబడడంతో ఉద్రిక్తత నెలకొంది.

వారి ప్రవర్తన అనుచితం భారత హైకమిషన్
లండన్ యూనివర్సిటీలో జరిగిన ఘటనను బ్రిటన్‌లోని భారత రాయబార కార్యాలయం ఖండించింది. సభికుల ప్రవర్తన అనుచితంగా ఉన్నదని వ్యాఖ్యానించింది. సీజేఐ ఉపన్యాసం అనంతరం ఉత్సాహభరితంగా చర్చ జరిగిందని, అయితే ఓ వ్యక్తి కార్యక్రమానికి అంతరాయం కలిగించేందుకు ప్రయత్నించాడని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో విమర్శించింది. ‘ఇలాంటి అమర్యాదకరమైన ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు. చర్చను నిర్దేశించాల్సిన గౌరవప్రదమైన సంభాషణకు విరుద్ధం. అభిప్రాయబేధాలు ప్రజాస్వామ్య సమాజంలో సహజమే అయినప్పటికీ వాటిని మర్యాదపూర్వకంగా, గౌరవప్రదంగా వ్యక్తీకరించాలి’ అని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -