Sunday, June 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆదర్శ కమ్యూనిస్టు అచ్యుతరామయ్య

ఆదర్శ కమ్యూనిస్టు అచ్యుతరామయ్య

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు టి జ్యోతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

ఆదర్శ కమ్యూనిస్టు అచ్యుతరామయ్య అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి జ్యోతి అన్నారు. శనివారం హైదరాబాద్‌‌లోని తన అచ్యుతరామయ్య 100వ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఆత్మీయ సమ్మే ళాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు బంధువులు, మిత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. అనంతరం జ్యోతి మాట్లాడుతూ మార్క్సిజం పట్ల అచ్యుతరామయ్యకు అచంచల విశ్వాసం ఉందని చెప్పారు. దోపిడి ఉన్నంత కాలం కమ్యూనిజం ఉంటుందనీ, అది అనివార్యమనే నమ్మకంతో ఉంటారని గుర్తు చేశారు. ఆయన రైతాంగ ఉద్యమంలోనూ, ఆ సంఘం నిర్వా హణలోనూ కీలక పాత్ర పోషించారని చెప్పారు. పార్టీ కార్యాలయంలో అడిట్ నిర్వాహణలో భాగమయ్యారని తెలిపారు. ఆయన వందోవ పుట్టిన రోజు జరుపుకోవటం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పార్టీ రాష్ట్ర కమిటీలకు రూ.25వేల చొప్పున పార్టీకి విరాళం ఇచ్చారు. సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్. వీరయ్యకు, ఏపీ రాష్ట్ర కమిటీ సభ్యులు జయరామ్‌‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ, కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్, పి ప్రభాకర్, ఎండీ అబ్బాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు అచ్యుత రామయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -