ప్రపంచ పోలీసుగా అమెరికన్ సామ్రాజ్యవాదం
దానికి వ్యతిరేక పోరాటాల్లో భాగస్వాములమవుదాం: సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం సాయిబాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కార్మిక వర్గం ఉధృత పోరాటాలకు సన్నద్ధం కావాల్సిన పరిస్థితులు ఆసన్నమయ్యాయని సీఐటీయూ అఖిల భారత కోశాధికారి ఎం సాయిబాబు అన్నారు. శనివారం హైదరాబాద్ లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అధ్యక్షతన రెండు రోజులు పాటు రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రపపం పోలీసుగా వ్యవహరిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దానికి వ్యతిరేకంగా సాగే పోరాటాల్లో కార్మిక వర్గం ముందువరసలో ఉండాలని సూచించారు. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ పై యుద్ధం వల్ల ప్రపంచంలో అన్ని దేశాలపై దాని ప్రభావం ఉందన్నారు. ఇంధన ధరలు పెరగడంతో కార్మికవర్గం , ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. నిజ వేతనాలు బాగా పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. హర్మూజ్ జలసంధి ద్వారా 20 శాతం గ్యాస్ రవాణా జరుగుతుందని తెలిపారు. మన దేశం దిగుమతులు మీద ఆధారపడటంతో అయిల్ , ఎరువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. ఇదంతా ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. సిమెంట్, స్టీల్, కోల్, ఇండెక్స్, ఇండస్ట్రీస్, తీవ్ర అసమానతలకు గురవు తున్నాయని వివరించారు. దీనివల్ల ఉపాధి కల్పన తగ్గుతుందదన్నారు. యాజ మాన్యాలు ఉత్పత్తిలో కూడా ఏఐ ఉ పయోగించడం వల్ల లాభాలు పెరుగుతున్నాయని చెప్పారు. కార్మికులకు వేతనాలు తగ్గుతు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్ లో ప్రతి ఏడాది మోడీ ప్రభుత్వం యాజమాన్యాలకు లక్షల కోట్లు రాయితీలు ప్రకటిస్తున్నదని చెప్పారు. పీఎస్ఐ ప్రొడక్షన్ లింక్స్డ్ ఇన్సెంటీవ్ ద్వారా యాజమాన్యాలకు ప్రోత్సాహకాల పేరు మీద, ఇన్సెంటివ్ పేరు మీద లక్షల కోట్లు చెల్లిస్తున్నారని తెలిపారు. ఇటీవల రాజీవ్ ఎక్స్ ప్రమావేట్ కంపెనీ భాగోతం బయటపడిందన్నారు. దీనికి దేశంలో రూ.150 వేల కోట్లుగా చూపారని తెలిపారు. వాస్తవానికి 10శాతం కంటే ఎక్కువ లేదని చెప్పారు. జీడీపీలో 42శాతం హౌస్ హెూల్డ్ రుణాల ద్వారా ప్రజలు రుణ ఊబిలోకి పోతున్నారన్నారు. నిజ వేతనాలు పడిపోవడంతో కార్మి కవర్గంలో తీవ్ర అసంతృప్తి పెరుగుతుం దన్నారు. రాష్ట్రంలో రైతు డిస్కంల పేరు మీద మరొక డిస్కం తీసుకొస్తున్నారని చెప్పారు. దీంతో రైతులకు, వినియోగదారులకు పోటీలు పెట్టి, రైతులకిస్తున్న సబ్సిడీలు వేసి వచ్చిన నష్టాలను మధ్యతరగతి, వివిధ వర్గాల మీద భారాలు వేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతుందని చెప్పారు. కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్ లు కార్మికవర్గానికి నష్టదాయకమని తెలిపారు. 70 లక్షల సభ్యత్వం ఉన్న సీఐటీయూను సిఐటియును ఐఎల్ఓకు ప్రతినధిగా ఇవ్వకపోవడం. మోడీ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన అనుబంధ సంఘాలన్నీ ఐఎల్ఓ జనరల్స్ కు లేఖలు రాయాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. వీరయ్య, భూపాల్, ఎస్వీ. రమ, కళ్యాణం వెంకటేశ్వర్లు, జె. మల్లిఖార్జున్, వి.ఎస్. రావు, కె. ఈశ్వర్రావు, రాష్ట్ర కార్యదర్శులు జె. వెంకటేష్, ఎ. ముత్యంరావు, బి. మధు, బి. మల్లేష్, ఎం. పద్మశ్రీ, కూరపాటి రమేష్, పుప్పాల శ్రీకాంత్, ఎం. వెంకటేష్, ఎ.జె. రమేష్, కె. గోపాలస్వామి, కాసు మాధవి, పి. సుధాకర్, జి. కవితలతో పాటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.
ఉధృత పోరాటాలకు కార్మిక వర్గం సిద్ధం కావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



