Sunday, June 7, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమధ్యప్రాచ్యంలో ఆగని దాడులు

మధ్యప్రాచ్యంలో ఆగని దాడులు

- Advertisement -

కువైట్, బహ్రెయిన్ పై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్ అడ్డుకున్న అమెరికా సేనలు లెబనాన్‌లో కన్పించని ‘కాల్పుల విరమణ’
నవ తెలంగాణ – జనరల్ డెస్క్

కాల్పుల విరమణను బేఖాతరు చేస్తూ లెబనాన్‌లో ఇజ్రాయిల్ దాడులు చేస్తూనే ఉంది. ఈ దాడులలో శుక్రవారం 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ లెబనాన్‌లో హిజ్బుల్లా, ఇజ్రాయిల్ మధ్య ఘర్షణలు అంతకంతకూ ఉధృతమవుతున్నాయి.
 ఇదిలావుం డగా హార్ముజ్ జలసంధి, గల్ఫ్ ప్రాంతం దిశగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. వాటిని అమెరికా సేనలు అడ్డుకున్నాయని, నాలుగు డ్రోన్లను కూల్చివేసి గోరక్, ఖెష్మ్ దీవిలోని కోస్తా గస్తీ రాడార్ వ్యవస్థలపై పెద్ద ఎత్తున కాల్పులు జరిపామని సెంట్రల్ కమాండ్ తెలిపింది. ‘కువైట్, బహ్‌రైన్ దిశగా ఇరాన్ ఏడు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిం చింది. దానికి కొన్ని గంటల ముందు హార్ముజ్ జలసంధి వైపు ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లలో నాలుగింటిని కూల్చేశాం. ఇరాన్ ప్రయోగించిన ఏడు క్షిపణులలో ఆరింటిని మధ్యలోనే నిలువరించాం. మరొకటి లక్ష్యాన్ని చేరుకోలేక పోయింది. ఇరాన్ దాడులలో ఎవరూ గాయపడలేదు’ అని వివరించింది. బహ్‌రైన్‌లోని అమెరికా ఫిప్త్ ఫ్లీట్ కేంద్ర కార్యాలయానికి నష్టం కలిగించానంటూ ఇరాన్ చేసిన ప్రకటనను తోసిపుచ్చింది. కాగా టెహ్రాన్ దాడులు ’హెచ్చరిక చర్య’గా జరిపినవేనని, ఆ ప్రాంతంలో అమెరికా నౌకాదళానికి చెందిన ఓడలు మోహరించి ఉన్నందున హెచ్చరికగా ఈ దాడులు జరిగి ఉండవచ్చునని ఇరాన్ అధికార మెహర్ వార్తా సంస్థ తెలియజేసింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో కువైట్, బహ్‌రైన్‌లలో సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు.
తమ దేశం వైపు ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు దూసుకొస్తుండడంతో సైరన్లు మోగించామని కువైట్ సైన్యం తెలిపింది. ఇరాన్ వైపు నుంచి దాడులు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని బహ్‌రైన్ సూచించింది.
సిరిక్, ఖెష్మ్ సహా ఇరాన్ కోస్తా ప్రాంతాలపై అమెరికా జరిపిన దాడులకు ప్రతిగా శత్రు స్థావరాలపై విరుచుకుపడ్డామని ఇస్లామిక్ రి
వ ల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) తెలిపింది. రెండు అమెరికా స్థావరాలను ఏరోస్పేస్ ఫోర్స్ క్షిప ణులు తాకాయని చెప్పింది. ఇది లావుండగా అమెరికా, ఇజ్రాయిల్ దేశాలతో జరుగుతున్న పోరులో తమ దేశాన్ని టెహ్రాన్ పావుగా వాడుకుంటోందంటూ లెబనాన్ అధ్యక్షుడు జోసఫ్ ఔన్ చేసిన ఆరోపణను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తిప్పికొట్టారు. ‘ముందు మీ శత్రువు నుంచి లెబనాన్‌ను రక్షించుకోండి’ అంటూ హితవు పలికారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -