Friday, February 13, 2026
E-PAPER
HomeఆటలుT20 WORLD CUP..ఏ గ్రూపులో ఎవ‌రు ముందంజ‌..?

T20 WORLD CUP..ఏ గ్రూపులో ఎవ‌రు ముందంజ‌..?

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: భార‌త్-శ్రీ‌లంక దేశాల‌ సంయుక్త వేదిక‌ల ద్వారా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. మొత్తం 20 జ‌ట్లు పాల్గొన్న ఈ మెగా టోర్నీలో.. నాలుగు గ్రూపు(ఏ,బీ, సీ, డీ)లుగా విభ‌జించారు. ప్ర‌తి గూప్‌లో 5 జ‌ట్లు ఉండ‌గా..ఆయా గ్రూపులోని ప్ర‌తి టీం మిగ‌తా జ‌ట్ల‌తో ఒకో మ్యాచ్ ఆడాల్సింటుంది. నాలుగు గ్రూపులోని టాప్ టూ స్థానంలో ఉన్న టీంలు సూప‌ర్-8కు అర్హ‌త సాధించ‌నున్నాయి. ఈక్ర‌మంలోనే ప‌లు జ‌ట్లు సంచ‌ల‌న విజ‌యాలు న‌మోదు చేయ‌గా..టైటిల్ ఫేవ‌రేట్లుగా ఉన్న ప‌లు జ‌ట్ల‌కు చావుత‌ప్పి క‌న్నులోట్ట‌పోయిందన్న చందంగా విజ‌యాన్ని సాధించాయి. దీంతో ఆయా గ్రూపుల్లో టాప్ ప్లేస్‌లో ఉండాల్సిన టీంల స్థానాల్లో తారుమారైయ్యాయి.

గ్రూప్‌- Aలో నాలుగు పాయింట్ల‌తో టీమిండియా అగ్ర‌స్థానంలో కొన‌సాగుతుంది. ఆడిన రెండు(యూఎస్ఏ, న‌మిబీయా) మ్యాచ్‌లోనూ గ్రాండ్ విక్ట‌రీ సాధించింది. ఈనెల 15న శ్రీ‌లంక వేదిక‌గా పాక్‌-భార‌త్ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. అదే విధంగా నాలుగు పాయింట్ల‌తో రెండో స్థానంలో పాకిస్థాన్ టీం ఉంది. పాక్ కూడా ఆడిన రెండు(నెద‌ర్లాండ్‌,యూఎస్ఏ ) మ్యాచ్లోను విజ‌యం సాధించింది. ఇక నెద‌ర్లాండ్ 2పాయింట్ల‌తో మూడో స్థానం, యూఎస్ఏ నాల్గో, న‌మిబీయా చివ‌రి స్థానంలో లో ఉన్నంది.

గ్రూప్‌- Bలో అతిథ్య జ‌ట్టు శ్రీ‌లంక నాలుగు పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో ఉంది. ఆస్ట్రేలియాను ఓడించిన‌ జింబాబ్వే నాలుగు పాయింట్ల‌తో రెండో స్థానంలో ఉంది. ఆసీస్‌ మూడో, ఐర్లాండ్ నాల్గో, ఓమ‌న్ ఐదో స్థానాల్లో ఉన్నాయి.

గ్రూప్‌- Cలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించిన వెస్ట్ండిస్ నాలుగు పాయింట్ల‌తో మొద‌టి స్థానంలో ఉండ‌గా, అన్యూహంగా ఐర్లాండ్ రెండు పాయింట్ల‌తో సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఇటలీ మూడు, ఇంగ్లాండ్ నాల్గో, బ్రిట‌న్ ను వ‌ణికించిన నేపాల్ ఇట‌లీ చేతిలో ఓడిపోయి చివ‌రి స్థానంలో ఉన్నంది.

గ్రూప్‌-Dలో నాలుగు పాయింట్ల‌తో న్యూజిలాండ్ ఫ‌స్ట్, త‌ర్వాత స్థానంలో సౌతాఫ్రికా, రెండు పాయింట్లతో మూడో స్థానంలో యూఏఈ, ద‌క్ష‌ణాఫ్రికాతో రెండు సూప‌ర్ ఓవ‌ర్లో పోరాడి ఓడిన అప్ఘానిస్థాన్ నాల్గో, కెన‌డా చివ‌రి స్థానాల్లో ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -