Tuesday, June 16, 2026
E-PAPER
Homeఖమ్మంయూరియా బుకింగ్ సులభతరం.. 

యూరియా బుకింగ్ సులభతరం.. 

- Advertisement -

– రైతులకు మరింత చేరువలో ఆన్‌లైన్ సేవలు..
– ఏడీఏ పెంటేల రవికుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట

తెలంగాణ ప్రభుత్వం 2026 వానాకాలం పంట సీజన్‌ లో రైతులకు యూరియా పంపిణీని మరింత పారదర్శకంగా,సులభంగా అందించేందుకు ఫర్టిలైజర్ యాప్‌ను విస్తృతంగా అమలు చేయడానికి సిద్ధమైందని,కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అమలవుతున్న ఈ విధానం ద్వారా రైతులు తమ పంట,సాగు విస్తీర్ణం ఆధారంగా ఇంటి నుంచే యూరియాను బుక్ చేసుకునే అవకాశం కల్పించబడిందని అశ్వారావుపేట వ్యవసాయ డివిజన్ ఏడీఏ పెంటేల రవికుమార్ తెలిపారు.

రైతులు తమ మొబైల్ ఫోన్‌లో ఫర్టిలైజర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని యూరియా బుకింగ్ చేసుకోవచ్చు. ఇంకా వివరాలు ఆన్‌లైన్‌ లో నమోదు చేయని రైతులు వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈఓ లు) సహాయంతో ఆధార్ నంబర్, మొబైల్ నెంబర్ ను భూమి వివరాలతో అనుసంధానం చేసుకుని యాప్‌ లో నమోదు చేసుకోవచ్చు. యాప్ డౌన్‌లోడ్, నమోదు ప్రక్రియలో సహాయపడేందుకు ప్రతి ఎరువుల డీలర్ కేంద్రంలో రైతుకు సహాయం చేసేందుకు ప్రత్యేక వాలంటీర్ అందుబాటులో వుంటారు.

ఈ విధానం ద్వారా రైతులు యూరియా కోసం క్యూల్లో నిలబడాల్సిన అవసరం లేకుండా గౌరవప్రదంగా ఎరువులు పొందగలుగుతారు. చిన్న, సన్నకారు రైతులు తమకు అవసరమైన యూరియా బ్యాగులను ఒకేసారి పొందే అవకాశం ఉండగా, పెద్ద రైతులు తమ సాగు విస్తీర్ణాన్ని బట్టి విడతల వారీగా యూరియా తీసుకోవచ్చు.

అలాగే రైతులు ప్రైవేట్ డీలర్లు, సహకార సంఘాలు (సొసైటీలు), ఎంపికచేసిన రైతు వేదికలలో అందుబాటులో ఉన్న యూరియా నిల్వలను యాప్‌ లో చూసి తమకు సమీపంలోని కేంద్రంలో ముందుగానే బుక్ చేసుకోవచ్చు.

అశ్వారావుపేట వ్యవసాయ డివిజన్‌ లో యూరియా అందుబాటులో ఉన్న సొసైటీలు:

అశ్వారావుపేట
నారాయణపురం
దమ్మపేట
గుంపెన
గానుగపాడు
ములకలపల్లి

యూరియా పంపిణీకొరకు ఎంపిక చేసిన రైతు వేదికలు :

అనంతారం
తిరుమలకుంట
మల్లారం (మందలపల్లి)
పట్వారిగూడెం
మల్కారం
గండుగులపల్లి (నాగుపల్లి)
అన్నపురెడ్డిపల్లి
చంద్రుగొండ
పూసుగూడెం
జగన్నాధపురం
పొగళ్లపల్లి

పట్టా భూమి కలిగిన రైతుల వివరాలు భూ భారతి పోర్టల్ నుంచి యాప్‌లోకి అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు. రెవెన్యూ పట్టాదారులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాదారులు, ఎన్‌డీఎస్ రైతులు, కౌలు రైతులు కూడా ఈ యాప్ ద్వారా యూరియా పొందే అవకాశం కల్పించారు.

అందుబాటులో ఉన్న యూరియా స్టాక్ వివరాలు :

సొసైటీలు 
రిటైలర్స్ 
గుర్తించిన రైతు వేదికలు 
మార్క్ ఫెడ్ 
గోడౌన్లు

యూరియా యాప్ సౌకర్యాలు :

– ఎప్పటికప్పుడు యూరియా స్టాక్ వివరాలు తెలుసుకోవచ్చు.
– యాప్ ద్వారా సులభంగా బుక్ చేయవచ్చు.
– రైతులు తమకు అందుబాటులో దగ్గరలో ఉన్న రిటైలర్స్ వద్దగాని, సొసైటీ లో గాని లేదా రైతు వేదికలో ఎంత పరిమాణం లో యూరియా ఉందొ తెలుసుకొని బుక్ చేసే సౌకర్యం ఉంది.
– యూరియా పంపిణీలో పారదర్శకంగా ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేని విధానం.

యూరియా బుకింగ్ కొరకు ఏవిధమైన సహాయం టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పొందవచ్చు. ఎరువుల బుకింగ్, యాప్ వినియోగం, బుకింగ్ సమస్యలు మరియు ఇతర సేవలకు సంబంధించిన సమాచారం కోసం రైతులు 1800 123 7157 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చు. పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ యాప్ వివరాలకు సంబందించిన సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఈ హెల్ప్‌లైన్ ద్వారా రైతులకు ఎరువుల బుకింగ్ సమాచారం, సమస్యల పరిష్కారం, మార్గదర్శకత్వం మరియు త్వరితగతిన సహాయం అందించబడుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -