ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఈనెల 19న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ప్రీ రిలీజ్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాతలు డి.సురేష్ బాబు, స్వప్నా దత్, జాన్వీ నారంగ్, డైరెక్టర్ దేవా కట్టా తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ,’ఈ సినిమాతో సమంతకి మంచి విజయం దక్కాలి. ‘ఓ.. బేబీ’తో సమంత, నందినీ కలిసి నాకు మంచి సక్సెస్ ఇచ్చారుఅని తెలిపారు. ‘నేను ఇకపై ఏడాదికి రెండు సినిమాలు అభిమానులకు అందించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు అయితే ఓ మంచి చిత్రాన్ని చేశాం. ఇప్పటి వరకు నేను నటిగా ఎంతో ఎంజాయ్ చేశారు. నిర్మాతకు ఉండే కష్టాలు ఇప్పుడు తెలుస్తున్నాయి. నా మీద ఇప్పటికీ అదే ప్రేమను చూపిస్తున్న అభిమానులకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఈనెల 19న రాబోతోన్న మా సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది అని సమంత చెప్పారు. నిర్మాత రాజ్ నిడిమోరు మాట్లాడుతూ,’ఈ చిత్రానికి వసంత్, ధర్మేంద్ర పిల్లర్స్‌లా నిల్చున్నారు. ఈ జర్నీలో ఎంతో మంది గొప్ప టెక్నీషియన్లను, ఆర్టిస్టులను కలుసుకున్నాం. నందినీతో పని చేయడం ఆనందంగా ఉంది. మేం రాయడం ఒకెత్తు అయితే.. సమంత నటించడం ఇంకో ఎత్తు. సమంత ఓ అద్భుతమైన నటి. మేం హిందీలో ఎన్నో సినిమాలు చేశాం. కానీ దీనికి వస్తున్న రెస్పాన్స్, ఎగ్జైట్మెంట్ నాకు ఎక్కడా కనిపించలేదు` అని అన్నారు. ‘నేను ఇచ్చిన మాట ప్రకారం సినిమాని ది బెస్ట్‌గా తీశానని భావిస్తున్నా. హిమాంక్ ఈ మూవీని భుజానికి ఎత్తుకున్నారు. నా మీద సమంత పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను. ఇంత వరకు చూసిన సమంత కంటే.. పది రెట్ల సమంతను చూస్తారు’ అని డైరెక్టర్ నందినీ రెడ్డి అన్నారు.
సరికొత్త సమంతని చూస్తారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



