విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మిం చారు. జూలై 3న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా డీవోపీ ఎస్. సౌందరరాజన్ మీడియాతో సినీ విశేషాలను షేర్ చేసుకున్నారు. నేను ఇంతకుముందు అభిషేక్ తో ‘డెవిల్సినిమా చేశాను. ఆయన చాలా పెద్ద విజన్‌తో ఈ కథను మొదలు పెట్టారు. నేను స్క్రిప్ట్ స్టేజ్ నుంచే ఈ ప్రాజెక్టులో ఇన్‌వాల్వ్ అయ్యాను. 'నాగబంధం ఐడియా మా అందరినీ ఎంతగానో ఉత్సాహ పరిచింది. మొదట కథను లాక్ చేశాం. తర్వాత దాన్ని విజువల్‌గా ఎంత గ్రాండ్‌గా, ఎంగేజింగ్‌గా చూపించాలనే దానిపై ప్లాన్ చేశాం. నేను ఇంతకుముందు ఫాంటసీ సినిమాలు చేశాను. విజువల్స్‌ను గ్లామరైజ్ చేసి, ఎలివేట్ చేసేలా కూడా చేసిన అనుభవం ఉంది. కానీ ఈ సినిమా మాత్రం చాలా ప్రత్యే కం. చాలా నేచురల్ స్టైల్లో ఈ సినిమా చేశాం. ప్రతి సన్నివేశానికి తగ్గట్టుగా సహజమైన లైటింగ్‌తో, కథలో లీనమయ్యేలా తీశాను. ఎక్కడా ఓవర్ గ్లామర్ చేయడం, అనవసరమైన డ్రామా సృష్టించడం గాని చేయలేదు. నేను, డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్ కలిసి చాలా టెంపుల్స్ తిరిగాం. తిరు వనంతపురంలోని శ్రీ అనంత పద్మ నాభస్వామి ఆలయాన్ని సందర్శిం చాం. అక్కడ ప్రతి అంశాన్ని డీటెయిల్‌గా ఫొటోగ్రాఫ్ చేశాం. అదే ఆలయాన్ని ఆధారంగా చేసుకున్న ప్పటికీ సినిమాలో “శ్రీరంగపురం” అనే పేరు పెట్టాం. శ్రీరంగం, తిరువనంతపురం ప్రాంతాల వైభవాన్ని కలిపేలా ఆ పేరు నిర్ణయించాం. మొత్తంగా విజువల్స్ మెస్మరైజ్ చేస్తాయి.
‘నాగబంధం’ విజువల్స్ మెస్మరైజ్ చేస్తాయి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



