‘ప్రతి మాటను పాడుతూ చెప్పే సినిమా చేయాలని కలగన్నాను. ఆ ఆలోచన నాతోనే దాదాపు 40 ఏళ్ల పాటు ప్రయాణించింది. చివరికి నాగ్ అశ్విన్ దృష్టికి వెళ్లింది. ఆయన ఎంతో ఇష్టపడి, గొప్ప అభి రుచితో ముందుకు తీసుకెళ్లారు` అని దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు అన్నారు. తాజాగా ఆయన తెరకెక్కించిన సినిమా ‘సింగ్ గీతం’. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ నిర్మించారు. ఈనెల 12న విడుదలైన ఈ చిత్రం విశేష ఆదరణ పొందుతున్న సందర్భంగా దర్శ కుడు సింగీతం శ్రీనివాసరావు మీడియాతో ముచ్చటించారు. సుమారు 40 ఏళ్ల క్రితం నాకు ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది. ప్రపంచంలోనే తొలి సారిగా, సినిమాలోని ప్రతి సంభాషణను మాట్లాడకుండా పూర్తిగా పాట రూపంలో చెప్పాలని అను కున్నాను. ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రధాన కారణం నాగ్ అశ్విన్. నా వయస్సు దృష్ట్యా సాంకేతిక సహకారంతో ఆన్‌లైన్‌లో సినిమా తెరకెక్కించే విధానాన్ని నాగ్ అశ్విన్ ఏర్పాటు చేశారు. నా హోమ్ థియేటర్‌లో కూర్చుని, షూటింగ్ లొకేషన్‌లో జరుగుతున్న ప్రతిదీ ప్రత్యక్షంగా చూస్తూ నటీనటులకు సూచనలు ఇచ్చేవాడిని. ఇంట్లో నుంచే మొత్తం సినిమాను దర్శకత్వం వహించాను. ఈ చిత్రంలో నటించిన ప్రతి నటుడు తన పాత్రకు సంబం ధించిన పాటలను స్వయంగా పాడారు. సాధారణంగా సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్స్ ఉంటారు. కానీ ఇక్కడ ప్రతి నటుడు తన పాత్ర భావాలను స్వయంగా పాడారు.
ప్రయోగాలు, కొత్తదనం కోసం వెతకడం, ప్రేక్షకులకు ఎప్పుడూ చూడని అనుభూతిని ఇవ్వడం నా సినీ ప్రయాణంలో ముఖ్యమైన భాగంగా మారింది. ఆ తపనే ఇన్నేళ్ళుగా నన్ను ఉత్సాహంగా ఉంచింది.
నాగ్ అశ్విన్ సుసాధ్యం చేశారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



