Wednesday, June 17, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఅంతకుమించి..

అంతకుమించి..

- Advertisement -

పౌరులెవరో
మేం నిర్ణయిస్తాం
మేం పౌరులం కాదు
అంతకు మించి
ఓటర్లెవరో
మేం నిర్ణయిస్తాం
మేం పాలకులం
అంతకు మించి
భజన పరులం
ఈ రాజ్యాంగం మా కొక ఈక
మా రాజ్యాంగం మాకుందిగా..
అంబేద్కర్
దేవుడా ఏంటి?
భజన చేస్తే
స్వర్గం పోవడానికి..
దేశం సత్రం కాదు
ఎవడుబడితేవాడు
వచ్చిపోవడానికి..
పొట్ట చేత పట్టుకుని వస్తే
మనిషైపోతాడా?
పౌరుడవుతాడా?
చెదపురుగుతో సమానం..
మేం నిర్దేశకులం
ఉన్నోడికి ఊడిగం చేస్తాం..
అయినా అంతా
మాకే మొక్కాలి
కాదంటే కారాగారానికి
లేదా కాటికి..
మేం దివి నుండి
భువికొచ్చిన
భూసురులం
ఇప్పటికైనా నమ్ముతారా?
మేం పౌరులం కాదు
మనుషులం కాదు
అంతకుమించి..
కె. శాంతారావు,
9959745723

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -