Wednesday, June 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శానిటేషన్ పనులను పరిశీలించిన ఎంపీవో రాము

శానిటేషన్ పనులను పరిశీలించిన ఎంపీవో రాము

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్  : జుక్కల్ మండల కేంద్రంలోని శానిటేషన్ పనులను ఎంపీ ఓ రాము బుధవారం నాడు శ్రీనివాస్ గౌడ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఆక్సిజన్ పార్క్, తడి , పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియను, గ్రామంలోని వీధులలో శానిటేషన్ పనులను, నర్సరీని, వైకుంఠధామం, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాకాలం ప్రారంభమైనందున ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ నిర్వహించి నీరు నిలవకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. అదేవిధంగా ఆక్సిజన్ పార్కులో , వైకుంఠధామంలో, పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగింప చేయాలని ఆదేశించారు. వైకుంఠధామం లో నీటి వసతి అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని జిపి కార్యదర్శికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ తో పాటు వీటి కార్యదర్శి,  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -