- Advertisement -
నవతెలంగాణ-బాల్కొండ : మండల కేంద్రంలోని మహతి ఆశ్రమంలో విద్యార్థులకు పట్వారీ గోపికృష్ణ, తులసి ఆధ్వర్యంలో బుధవారం స్టేషనరీ వస్తువులు స్నాక్స్ వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఆర్మూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వర్ రెడ్డి హాజరై విద్యార్థులకు వస్తువులను వితరణ చేశారు. ఈ సందర్భంగా ఎసిపి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కష్టపడి ఉన్నత విద్యను అభ్యసించాలని ఆకాంక్షించారు. పట్వారీ తులసి సేవలు ఆదర్శం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమం నిర్వాహకులు నిర్మల , నరేష్, స్వరూప, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



