నవతెలంగాణ – అశ్వారావుపేట : అశ్వారావుపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా వాల్మీకి కిశోర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.ఈయన గతంలో ఖమ్మం జిల్లా ముదిగొండ లో మండల పంచాయతీ అధికారిగా (ఎంపీఓ) విధులు నిర్వహించారు.
ఇటీవల పదోన్నతి పొందిన అనంతరం అశ్వారావుపేట మండల అభివృద్ధి అధికారిగా నియమితులైన కిశోర్, బుధవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
ఇంతకుముందు ఎంపీడీవోగా పనిచేసిన అప్పారావు డిప్యూటీ సీఈఓగా పదోన్నతి పొంది బదిలీ కావడంతో, అప్పటి నుంచి ఎంపీఓ రామకోటారెడ్డి ఇన్‌ఛార్జి ఎంపీడీవోగా బాధ్యతలు నిర్వహించారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వాల్మీకి కిశోర్‌కు మండల స్థాయి అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేసి, ఆయన సేవలు మండల అభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు.



