Wednesday, June 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సమానంగా ఉన్నది ఓటు మాత్రమే : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య 

సమానంగా ఉన్నది ఓటు మాత్రమే : ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య 

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు :  కోటీశ్వరుడికైనా పూరిగుడిసెలో ఉండే పేదోని కైనా రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సమానంగా ఓటును హక్కుగా కల్పించారని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు.

బుధవారం నాడు భువనగిరిలోని మదర్ డైరీ గెస్ట్ హౌస్ లో పత్రికా ప్రతినిధుల సమావేశంలో తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ 25వ తేదీ నుండి గ్రామ గ్రామాన చేపట్టే  సర్ పై ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క భారతదేశ పౌరునికి  పౌరురాలికి ఓటు వేసే అధికారం ప్రాథమిక హక్కుగా సంక్రమించిందన్నారు.

ఓట్ల చోరీతో గద్దెనెక్కిన మోడీ ప్రభుత్వం ప్రస్తుతం సీట్ల చోటికి పాల్పడుతుందన్నారు.ఇందుకు నిదర్శనం ఇటీవలే ఏ ఐ సీ సీ తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సభ్యత్వాన్ని తిరస్కరించడమే ప్రజలు గమనించాలన్నారు. 

అర్థం పర్థం లేని ప్రైవేట్ కేసు సాకుతో ఎన్నికల కమిషన్ కాంగ్రెస్ పార్టీ కి వచ్చే రాజ్యసభ సీటు రాకుండా చేసిందన్నారు. 

రాజ్యసభలో ఎలాగైనా బలాన్ని పెంచుకొని తన మతతత్వ రాజకీయాలను బిజెపి కొనసాగించేందుకు రాజ్యసభ సభ్యులను సంతలో పశువుల లాగా కొని బిజెపిలో కలుపుకొని వాషింగ్ మిషన్ రాజకీయాలకు తేరలేపిందన్నారు.ఢిల్లీ లో ఆప్ పార్టీ రాజ్యసభ సభ్యులను  బిజెపిలో విలీనం చేసుకోవడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే అన్నారు.గతంలో బీహార్ ఇటీవల బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బిజెపి పార్టీ ఓట్ల చోరీకి పాల్పడి  అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి ఇటీవల వచ్చిన సందర్భంగా బిజెపి ఒంటరిగా పోటీ చేసి తెలంగాణలో గెలుపు సాధిస్తామని ధీమా వ్యక్తం చేయడం అనుమానాలకు తావిస్తుందన్నారు.తెలంగాణలో కూడా ఎన్నికల కమిషన్ ను దుర్వినియోగం చేసి  ఓట్ చోరీకి పాల్పడేందుకు పాల్పడే ప్రయత్నాలకు కాంగ్రెస్ పార్టీ దేశభక్త సైనికులు బి ఎల్ ఏ లు దీటుగా ఎదుర్కోవాలి అన్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఎస్సీ  ఎస్టీ  మైనార్టీలు కాంగ్రెస్ పార్టీ కి పెట్టని కోట లాగా ఉన్నారని వారి ఓట్లను తొలగించేందుకు  బిజెపి వేసే ఎత్తులు  తెలంగాణలో సాగనివ్వమన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా గత నెల ఏఐసిసి తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ సీఎం ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి ఎన్నికల బూత్ లో ఉన్న ఓట్లను పర్యవేక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కు  బి ఎల్ ఏ లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు.జిల్లా కాంగ్రెస్ పార్టీఅధ్యక్షు సంతకం తో జిల్లాలోని బి ఎల్ ఎ ల ఎంపిక చేసిన లిస్టు కలెక్టర్ కార్యాలయంలో అందజేసినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో మదర్ డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి,డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తుల నరేందర్ రెడ్డి,పి నర్సింలు జి రామ్ రెడ్డి ఎస్ భాస్కర్, కే పాండు కే శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -