Thursday, June 25, 2026
E-PAPER
Homeఖమ్మందమ్మపేటలో ‘న్యూ స్టార్’ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం

దమ్మపేటలో ‘న్యూ స్టార్’ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం

- Advertisement -

– భారీగా తరలివచ్చిన ప్రజలు
– ఉచితంగా వైద్య పరీక్షలు, మందులు పంపిణీ 
నవతెలంగాణ-దమ్మపేట : భద్రాద్రి-కొత్తగూడెం ​జిల్లా దమ్మపేట మండలం కేంద్రంలో సత్తుపల్లి న్యూ స్టార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ​న్యూ స్టార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సురేష్ రామాల పర్యవేక్షణలో జరిగిన ఈ ఉచిత వైద్య శిబిరంలో స్థానిక ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ గ్రేటర్ బాధ్యులు దారా మల్లికార్జునరావు, పసుమర్తి రామభద్రం, బచ్చు రవిచంద్ర, పోలిశెట్టి శివకుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

​ప్రముఖ జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులు డాక్టర్ లహరి భీమిరెడ్డి, ఈఎన్‌టీ నిపుణులు డాక్టర్ ముదిశెట్టి ఉమేష్ వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సంబంధిత సలహాలు, సూచనలు అందించారు. 

​ఈ శిబిరంలో దమ్మపేట పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఉచిత వైద్య సేవలను, మందులను అందుకున్నారు.

​ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ రామాల మాట్లాడుతూ  సత్తుపల్లిలో మొట్టమొదటి అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా ‘న్యూ స్టార్’ను తీర్చిదిద్దామని తెలిపారు.

​చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని రకాల వైద్య సేవలు, నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. ​సామాన్యులకు  సైతం తక్కువ ఖర్చుతో,  నాణ్యమైన కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే తమ న్యూ స్టార్ హాస్పిటల్ ముఖ్య ఆశయమని స్పష్టం చేశారు.

​సత్తుపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, పెనుబల్లి, కల్లూరు, వేంసూరు ప్రాంతాల ప్రజలు ఈ మెరుగైన వైద్య సేవలను ఉపయోగించుకోవాలని డాక్టర్ సురేష్ రామాల కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -