Wednesday, July 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వర్షం పడే వరకు జలాభిషేకాలు కొనసాగిద్దాం

వర్షం పడే వరకు జలాభిషేకాలు కొనసాగిద్దాం

- Advertisement -

సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ
నవతెలంగాణ – ఆలేరు రూరల్

ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని శ్రీ చండికా సోమేశ్వర స్వామి ఆలయంలో గ్రామ సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ వెంకటేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ ఆలయంలోని కోటి ఒక్క లింగానికి జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ యాకమ్మ మాట్లాడుతూ గ్రామంలో వర్షాలు కురిసే వరకు ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో సోమేశ్వర స్వామివారికి జలాభిషేకాలు కొనసాగిద్దామని, గ్రామ ప్రజలంతా ఐక్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిద్దాం అని పిలుపునిచ్చారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు గ్రామ ప్రజలందరూ ఆలయానికి వచ్చి కోటి ఒక్క లింగానికి జలాభిషేకం నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -