నవతెలంగాణ-మోర్తాడ్
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులను బుధవారం ముందస్తు అరెస్టు చేశారు. నియోజకవర్గంలోని భీంగళ్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యే చేపడుతున్న దీక్షకు వెళ్లకుండా ముందస్తు అరెస్టు చేసినట్లు తెలిపారు. తమ నాయకుడు భీంగల్ గ్రామంలో పలు వీధిలో తిరుగుతూ 70 శాతం చేసిన పనులను ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్న పనులను నత్త నడిపిన చేపట్టడం వాటిపై పోరాటం చేస్తుంటే అడ్డుకోవడం సహజం కాదని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే భీంగల్ పట్టణాన్ని సుందరీ కరణ చేస్తామని నమ్మబలికిన నాయకులు ఎక్కడికి వెళ్లారని అన్నారు. భీంగల్ గ్రామానికి ఐదు కోట్ల రూపాయలను సాంక్షన్ చేసి నత్త నడకన సాగుతున్న పనులన్నిటిని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఒకరోజు కటోర నిరాహార దీక్ష కార్యక్రమాన్ని అడ్డుకోవడం సరికాదని మండల పార్టీ నాయకుడు ఏలియా అన్నారు. అరెస్ట్ అయిన వారిలో మండల అధ్యక్షుడు ఏలియా, పాపాయి పవన్, యూసుఫ్ ,శివకుమార్ ,మహేందర్ తదితరులు ఉన్నారు.
బీఆర్ఎస్ నాయకుల అరెస్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



