నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని అమీర్ నగర్ గ్రామ పరిధిలోని బిల్యా నాయక్ తండాకు చెందిన మలావత్ ఆదికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు చేసిన ఆర్థిక సహాయం చెక్కును బుధవారం అందజేశారు. అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న బాధితుడు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాడు. బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ రెడ్డి కృషితో ప్రభుత్వం బాధితుడు ఆదికి రూ.24వేల ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక సహాయం చెక్కును మంజూరు చేసింది. అట్టి చెక్కును స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారునికి అందజేశారు. ఆర్థిక సహాయం చెక్కులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, ఇందుకు కృషి చేసిన ముత్యాల సునీల్ రెడ్డికి లబ్ధిదారుడు ఆది కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీలవేణి దశరథ్, వార్డు సభ్యులు పుప్పాల నరసయ్య, క్యాతం గంగారెడ్డి, కమ్మరి భూమారెడ్డి, మలావత్ గోవింద్, తదితరులు పాల్గొన్నారు.
బాధితునికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



