ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కు ఫిర్యాదు
నవతెలంగాణ-ఆర్మూర్
మాభూమి మాకు ఇప్పించాలని మండలంలోని మగ్గిడి గ్రామానికి చెందిన ఎర్రవ్వ బుధవారం ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. గతంలో 2005 లో జోగిని వ్యవస్థ నిర్మూలన కోసం అప్పటి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సర్వే నంబర్ 360/1/3 ఒక్క ఎకరం పద్దెంది గుంటల భూమి ఇచ్చారని గుర్తు చేశారు. అందుకు నేను పలుమార్లు సాగు చేయడానికి వెళ్ళినప్పుడల్ల కొందరు భూ అక్రమ దారులు నన్ను కొట్టారని వాపోయారు. భూమిలోకి వస్తే నిన్ను భూమిలోనే పాతిపెడతామని మామిడి చిన్న గంగారాం, మామిడి గంగాధర్, మగ్గిడి పోచిట్టి,,అవుట్ల చిన్న గంగారాం, రామాయల్లా భూమేష్, నూతిపల్లి శ్రీనివాస్ లు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా భూమిని దౌర్జన్యంగా ఆక్రమించారనీ బాదితురాలు దమ్మడి ఎర్రవ్వ కమిషన్ చైర్మన్ కు మోరపెట్టుకున్నారు. ఈ భూ తగాదాల మూలంగా నాకూ నా కొడుకు రాకేష్ కు ప్రాణహాని ఉందనీ, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని తెలిపారు. అధికారులు తమకు న్యాయం చేయాలని ఆమె ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కు వినతిపత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో అంబెడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఇత్వర్ పేట్ లింగన్న కూడా పాల్గొని ఎర్రవ్వకు న్యాయం జరుగలని చైర్మన్ ను కోరారు.
మా భూమి మాకు ఇప్పించండి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



