భూపాలపల్లి జిల్లా విద్యుత్ ఎస్సి రమేష్
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్ల, పెద్దతుండ్ల గ్రామాల్లో ఏఎంఆర్ విద్యుత్ సబ్ స్టేషన్ ల పరిధిలో మెరుగైన,నాణ్యమైన విద్యుత్ సరఫరాకు తోడ్పడే విధంగా పెద్ద తుండ్ల సబ్ స్టేషన్ నుండి ఐదు కిలోమీటర్ల 33 కె వి ఇంటర్ లింక్ లైన్ ఏర్పాటు చేసి శనివారం ప్రారంభించీనట్లుగా భూపాలపల్లి జిల్లా విద్యుత్ ఎస్సీ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సి మాట్లాడుతూ తాడిచర్ల సబ్ స్టేషన్,పెద్దతుండ్ల సబ్ స్టేషన్ మరియు ఏఏంఆర్ సబ్ స్టేషన్ లకు 33 కేవి లైన్ సమస్య తలెత్తిన సందర్భంలో ఇంటర్ లింక్ 33 కెవి లైన్ ద్వారా విద్యుత్ వినియోగదారులకు, రైతులకు అంతరాయం లేకుండా విద్యుత్ అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటారం డిఈ నాగరాజు,సేఫ్టీ ఆఫీసర్ జగదీష్, కన్స్ట్రక్షన్ ఏడి సందీప్,ఏఈ శ్రీనివాస్,లైన్మెన్ అశోక్,ఏఎల్ఎం రాజేందర్,విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
33 కెవి ఇంటర్ లింక్ లైన్ ఏర్పాటు పనులు ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



