నవతెలంగాణ – పరకాల
పరకాల పట్టణంలోని ఎరువులు, పురుగు మందుల డీలర్ దుకాణాల్లో శనివారం వ్యవసాయ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పరకాల మండల వ్యవసాయ అధికారి ఎస్. శ్రీనివాస్, శ్యాంపేట మండల వ్యవసాయ అధికారి కుమారి మార్క ప్రియదర్శిని, ఏఈఓలు రజా, శరత్ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుకాణాల్లో స్టాక్ రిజిస్టర్లు, ఎరువుల నిల్వలు, ధరల పట్టికలు, స్టాక్ బోర్డులను పరిశీలించారు. రైతులకు స్పష్టంగా కనిపించేలా స్టాక్ వివరాలు, ధరల పట్టికలను ప్రదర్శించాలని డీలర్లను ఆదేశించారు. డీఏపీ, యూరియా తదితర ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన డీలర్ల లైసెన్సులను సస్పెండ్ చేయడం లేదా రద్దు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. నిషేధిత గడ్డి మందులను విక్రయించిన డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రతి దుకాణంలో స్టాక్ రిజిస్టర్లను నిబంధనల ప్రకారం ఎప్పటికప్పుడు నిర్వహించాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే నాణ్యమైన ఎరువులు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ అధికారులు డీలర్లకు సూచించారు.
ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



