- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం దక్కింది. మహిళల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను అద్భుత ప్రదర్శనతో పసిడి పతకం సాధించింది. స్నాచ్‌లో 85 కిలోలు ఎత్తిన ఆమె, క్లీన్ అండ్ జెర్క్‌లో 105 కిలోల బరువు ఎత్తి సరికొత్త కామన్వెల్త్ రికార్డు సృష్టించింది. మొత్తం 190 కిలోల బరువును సునాయాసంగా ఎత్తి మీరాబాయి ప్రత్యర్థులను చిత్తు చేసింది. ఈ అపూర్వ విజయంతో దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
- Advertisement -



