Tuesday, August 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరహదారుల నిర్మాణం, విస్తరణకు పెద్దపీట

రహదారుల నిర్మాణం, విస్తరణకు పెద్దపీట

- Advertisement -

మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి
రూ.146.71 కోట్లతో రహదారి 
పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ – బల్మూరు

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూర్‌లో రూ.146.71 కోట్ల అంచనా వ్యయంతో చేపట్ట నున్న మూడు హెచ్ ఏ ఎం (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) రహదారి పనులకు ఆదివారం రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. వనపర్తి-1 ప్యాకేజీ కింద అచ్చంపేట ఫేజ్-1లో ఈ పనులను చేపట్టనున్నారు. రూ. రూ.32.99 కోట్లతో అమ్రాబాద్- తొల్పలపల్లి రహదారి పదర, వాంకేశ్వరం, చిట్లముకుంట, ఉడిమిల్ల, ఇప్పలపల్లి గ్రామాల మీదుగా కిలోమీటర్ 10/000 నుంచి 34/200 వరకు రహదారిని బలోపేతం చేయనున్నారు. రూ.35.71 కోట్లతో బల్మూరు నుంచి నాగర్‌కర్నూల్ పీడబ్ల్యూడీ రహదారి బల్మూర్, గోదల్, తుమ్మన్‌పేట గ్రామాల మీదుగా రహదారిని రెండు లేన్లుగా విస్తరిం చనున్నారు. రూ.78.01 కోట్లతో అచ్చంపేట- రాకొండ (ఉప్పునుంతల మీదుగా) ఈ రహదారి ఉప్పునుంతల, మొల్గర, పెద్దాపూర్, మామిళ్లపల్లి, రాకొండ గ్రామాల మీదుగా రెండు లేన్లుగా విస్తరించనున్నారు. రహదారుల నిర్మాణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేయడంతో త్వరలోనే పనులు చేపట్టనున్నారు. రహ దారుల నిర్మాణం, విస్తరణ ద్వారా మరింత సౌకర్యవంతమైన రవాణా మార్గాలు అందుబాటులోకి రానున్నాయని మంత్రులు అభిప్రాయపడ్డారు. ​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -