సారంపల్లి మరణం పట్ల ఎస్వీకే సంతాపం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మల్లారెడ్డి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. నీటి పారుదల వ్యవస్థ, విద్యుత్ రంగం, వ్యవసాయ విధానాలపై ఎప్పటికప్పుడు లోతైన అధ్యయనం చేసిన ఆయన ఒక ఎన్‌సైక్లోపీడియాలాంటి వారని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి ఇతరులకు అందించే వారని తెలిపారు. జర్నలిస్టులకు, విశ్లేషకులకు ఆయన పెద్ద ఆదరవు అని పేర్కొన్నారు. వృద్దాప్యంలో కూడా అలసట లేకుండా శ్రమించిన నాయకుడని తెలిపారు. నిరాంబరుడు, నిస్వార్ద నాయకుడు, నిత్యకృషీవలుడని కొనియాడారు.
ఆయన ఓ ఎన్‌సైక్లోపీడియా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



