నవతెలంగాణ-హైదరాబాద్: విదేశీ పర్యటన నేపథ్యంలో ప్రధాని మోడీ ఉజ్బెకిస్థాన్ వెళ్లారు. శనివారం ఆ దేశ రాజధాని తాష్కెంట్‌కు చేరుకున్న ప్రధాన మంత్రికి ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయేవ్ ఆయనకు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో, రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధాన మంత్రి, అధ్యక్షుడు మిర్జియోయేవ్‌తో ప్రతినిధుల స్థాయి చర్చలు జరుపుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ అనుసంధానత, ఇంధనం, విద్య మరియు ప్రజల మధ్య సంబంధాల వంటి రంగాలలో సహకారాన్ని ఈ ఇద్దరు నాయకులు సమీక్షించడంతో పాటు, భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన అజెండాను ఖరారు చేస్తారు. ఆ తర్వాత కిర్గిస్థాన్‌లో జరిగే ఎస్‌సీవో 2026 సదస్సుకు హాజరవుతారు. ఎస్‌సీవో సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోదీ భేటీ అవుతారని భారత విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఉజ్బెకిస్థాన్ చేరుకున్న పీఎం మోడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



