- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: నేపాల్‌లో భారీ వరదలకు ఓ బ్యాంక్ లాకర్ కొట్టుకు వచ్చింది. ధాడింగ్ జిల్లాలోని గల్చీ గ్రామీణ మున్సిపాలిటీ-4 పరిధిలోని బెల్‌ఖుఖోలా సమీపంలో త్రిశూలి నది ఒడ్డున కనిపించింది. సెప్టెంబర్ 12న కొందరు స్థానికులు సేఫ్‌ను పగులగొట్టి అందులోని నగదును తీసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ కేసులో 29 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి వద్ద నుంచి రూ.92,68,505 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు.
- Advertisement -



