– పాదయాత్రలో భాగంగా ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు పరామర్శ
నవతెలంగాణ – ఖమ్మం : జర్నలిస్టుల హక్కుల పరిరక్షణలో జర్నలిస్టు సత్యానంద్ సేవలు శ్లాఘనీయమని తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సయ్యద్ ఖదీర్, కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు దువ్వా సాగర్, రాష్ట్ర కమిటీ కౌన్సిల్ సభ్యులు నాగేందర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యులు సంతోష చక్రవర్తి లు అన్నారు. జర్నలిస్టుల ఇండ్ల సాధన కోసం టి డబ్ల్యూ జేఎఫ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాదయాత్ర శనివారం మధిర నియోజకవర్గంలో ఎల్ గోవింథాపురంలో గల అమర జర్నలిస్టు మందా సత్యానంద్ నివాసానికి చేరుకుంది. ఫెడరేషన్ బృందం వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… యువ జర్నలిస్ట్ రోడ్డు ప్రాంతంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, ఆయన లేని లోటు వారి కుటుంబానికి జర్నలిస్ట్ సమాజానికి తీరని లోటు అని వారన్నారు. పసితనం వీడని చిన్నారుల చదువుల బాధ్యతను తమ యూనియన్ బుజస్కందాలపై వేసుకుందని భవిష్యత్తులో వివిధ సంఘాల సహకారంతో ఆ కుటుంబానికి చేయూతను అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల బాధ్యులు, జర్నలిస్టు జిల్లా నగర ప్రెస్ క్లబ్ కమిటీల బాధ్యులు, వీడియో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.



