Saturday, August 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టీపీసీసీ చీఫ్‌, మల్లు రవి లకు రాఖీలు కట్టిన మహిళలు

టీపీసీసీ చీఫ్‌, మల్లు రవి లకు రాఖీలు కట్టిన మహిళలు

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్ 
సోదర, సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రీతికగా నిలిచే రాఖీ పౌర్ణమి వేడుకలు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి లకు వారి నివాసాలలో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, యాదాద్రి భువనగిరి జిల్లా మహిళ అధ్యక్షురాలు నీలం పద్మ శనివారం రాఖి కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

రాఖీ పండుగ భారతీయుల సంస్కృతి, సంప్రదాయాల, ప్రేమ, ఆప్యాయత, గౌరవ, భద్రత, సమాన అవకాశాలు కల్పించడంతో పాటు ఆర్థిక సామాజిక రాజకీయ సాధికారికతో ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అన్ని రంగాలలో మహిళా చైతన్యం కోసం పాటుపడుతుందని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఉమెన్ కమిషన్ చైర్ పర్సన్ నీరెళ్ళ శారద, యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బోయపల్లి రేఖ, మాజీ స్టేట్ జనరల్ సెక్రెటరీ విద్యా రెడ్డి, రంగారెడ్డి జిల్లా మాజీ జిల్లా అధ్యక్షురాలు కళ్లెం సుజాత తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -