Wednesday, April 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంబెడ్కర్ అందరి వాడు.!

అంబెడ్కర్ అందరి వాడు.!

- Advertisement -

మల్హర్ ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
నవతెలంగాణ – మల్హర్ రావు

ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ అందరి వాడని పలువురు కొనియాడారు. మంగళవారం తాడిచెర్ల, పెద్దతూండ్ల, మల్లారం, కొయ్యుర్, ఎడ్లపల్లి, రుద్రారం, అడ్వాలపల్లి, గాదంపల్లి, ఇప్పలపల్లి గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీలు, అంబేద్కర్ సంఘాలు, ఆర్టీఐ, ప్రజా సంఘాలతోపాటు అన్ని వర్గాల ప్రజల ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అంబెడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్స్ కట్ చేసి స్వీట్స్, పండ్లు పంచారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, సర్పంచ్లు జంగిడి శ్రీనివాస్, బండారి నర్సింగం, బండి స్వామి, మేకల రాజయ్య, కొండ రాజమ్మ, అబ్బినేని లింగస్వామి, చంద్రగిరి అశోక్, ఉప సర్పంచ్లు లకావత్ సవేందర్, తాళ్ల రవిందర్, బొబ్బిలి రాజ్ గౌడ్, అక్కల దేవేందర్, వార్డు సభ్యులు, కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల నాయకులు, అంబేద్కర్, ప్రజా సంఘాల, యూత్ నాయకులు, అన్ని వర్గాల ప్రజలు, కొయ్యుర్ పోలీసులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -