నవతెలంగాణ-హైదరాబాద్: నారీ శక్తి వందన్ అభినీయం(మహిళలకు 33శాతం రిజర్వేషన్ ) బిల్లుతో పాటు డిలిమిటేషన్ సవరణను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడాన్ని ఇండియా బ్లాక్ వ్యతిరేకిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత మల్లిఖార్జున అన్నారు. పార్లమెంట్, అసెంబ్లీల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అందుకు తామంత మద్దతు ఇస్తామన్నారు. కానీ సమగ్ర చర్చలు లేకుండా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టడం సమంజసం కాదని, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలతో సుదీర్ఘ చర్చలు జరపాల్సిన అవసరముందని ఆయన నొక్కి చెప్పారు. ఏకాభిప్రాయంలేని నిర్ణయాలు, చర్యలు సదురు బిల్లును బలహీనతలను, లోటుపాట్లలను తెలియజేస్తోందన్నారు. డిలిమిటేషన్‌పై రాజకీయ ఎజెండాతో మోడీ సర్కార్ ముందుకు పోతుందని విమర్శించారు.
డిలిమిటేషన్ విషయంలో బీజేపీ చీప్ ట్రిక్స్ ప్లే చేయాలని చూస్తోందని, ప్రతిపక్షాలన్ని పార్లమెంట్‌లో సదురు బిల్లును వ్యతిరేకిస్తాయని, అందుకు తామంతా ఏకాభిప్రాయంతో ఉన్నామని దీమా వ్యక్తం చేశారు. జనాభా లెక్కలపై కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత లేదని, రాజ్యాంగం ప్రకారం ఎప్పుడైనా నియోజకవర్గాల పునర్విభజనను చేపట్ట వచ్చు. కానీ వారు(బీజేపీ) ఇప్పటికే అస్సాం, జమ్మూ కాశ్మీర్‌లలో జనాలను మోసం చేశారని ఆరోపించారు.
ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ప్రతిపక్షనేతలందురు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడితో పాటు లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఆర్జేడీ వర్కింగ్ ప్రెసిడెంట్ తేజస్వి యాదవ్, ఎన్‌సిపి (ఎస్‌పి) ఎంపి సుప్రియా సూలే, శివసేన (యుబిటి) ఎంపి సంజయ్ రౌత్, రాజ్యసభ ఎంపి కపిల్ సిబల్, ఇతర ప్రముఖ ఇండియా బ్లాక్ నాయకులు హాజరయ్యారు.



