Thursday, April 16, 2026
E-PAPER
Homeఆటలుఐపీఎల్ చరిత్రలో కోహ్లీ అరుదైన రికార్డ్

ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ అరుదైన రికార్డ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బెంగళూరు వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దించింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో కోహ్లీ చీలమండ గాయానికి గురయ్యాడు. ఈ కారణంగానే అతడిని తుది జట్టులో కాకుండా ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించాలని ఆర్సీబీ యాజమాన్యం నిర్ణయించింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగినా కోహ్లీ తన ఫామ్‌ను కొనసాగించాడు. కొన్ని చక్కటి షాట్లతో అలరించి, ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అయితే, అర్ధశతకానికి ఒక్క పరుగు దూరంలో ఉండగా దురదృష్టవశాత్తు ఔటయ్యాడు. 147 పరుగుల లక్ష్య ఛేదనలో అవేశ్ ఖాన్ వేసిన బంతిని భారీ షాట్ ఆడ‌బోయి లాంగాన్‌లో ఉన్న నికోలస్ పూరన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -