- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మహిళా బిల్లు పేరుతో డీలిమిటేషన్ బిల్లు తీసుకువచ్చారని కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. మహిళా బిల్లు వీగిపోవడంతో ప్రతిపక్షాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ చాలా చేసింది. ‘‘మహిళా బిల్లు వీగిపోవడం.. బీజేపీ విధానాల ఓటమిగా భావించాలి. ఈ బిల్లుపై ప్రధానికి నిజాయతీ లేదు. నిజాయతీగా మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువస్తే.. పార్లమెంట్‌లో మద్దతు తెలిపేవారు. మోడీ.. ఉత్తర, దక్షిణ భారత్ మధ్య అంతరాలు సృష్టించే విధానాన్ని విరమించుకోవాలి’’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
- Advertisement -



