Saturday, April 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులు దళారులకు ధాన్యం అమ్మొద్దు

రైతులు దళారులకు ధాన్యం అమ్మొద్దు

- Advertisement -

–  వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను దళారులకు అమ్మొద్దని కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య అన్నారు. శనివారం మండలంలోని ఉప్లూర్ రైతు వేదిక భవనం వద్ద కమ్మర్ పల్లి సింగిల్ విండో ఆధ్వర్యంలో రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్మన్ నర్సయ్య మాట్లాడుతూ రైతులు ధాన్యం అమ్ముకునేందుకు దళారులను ఆశ్రయించవద్దన్నారు.రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళాలను నమ్మి అమ్ముకొని మోసపోవద్దన్నారు. రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2389, బి గ్రేడ్ ధాన్యానికి రూ.2369 మద్దతు ధరను ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు.ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పిన ప్రకారం సన్నపు వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ కూడా ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని తెలిపారు. 

 కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ, వ్యవసాయ విస్తీర్ణ అధికారి రమేష్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, సింగిల్ విండో ప్రత్యేక అధికారి రామన్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలేటి మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కొమ్ముల రవీందర్, నాయకులు తిప్పిరెడ్డి శ్రీనివాస్, తక్కురి దేవేందర్, అవారి సత్యం, బోనగిరి భాస్కర్, విండో కార్యదర్శి శంకర్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -