Sunday, April 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జొన్న రైతులకు అకాల వర్షాల భయం

జొన్న రైతులకు అకాల వర్షాల భయం

- Advertisement -

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్ 
మండలంలో జొన్న రైతులు ఆరుగాలం కష్టించి, పండించిన జొన్న పంటనను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వండిన పంటను దాచుకునే అవకాశం లేక తప్పనిసరి పరిస్థితుల్లో దళారులకు విక్రయించి తీవ్రంగా నష్టపోతున్నారు. యాసంగి సీజన్లో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. నానా తంటాలు పడి జొన్న పంట పండించారు. కానీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఎటూ పాలుపోక అవస్థలు పడుతున్నారు. ఖరీఫ్ సీజన్ మొత్తం ఏ పంట సాగు చేసినా నష్టాలే రావడంతో యాసంగిలో ఎన్నో ఆశలతో అప్పు చేసి జొన్న పంట సాగు చేశారు. నల్లరేగడి ప్రాంతాల్లో రైతులు జొన్న పంటను అత్యధికంగా సాగు చేస్తారు. 

యాసంగిలో వెంటనే కొనుగోలు చేయాలి. ప్రభుత్వం జొన్న పంట కొనుగోళ్లను వెంటనే చేపట్టాలి. ఆకాల వర్గాల నుంచి పంట దిగు బదులను కాపాడుకు నేందుకు పడరాని పాట్లు పడుతున్నాం. పంట పండించడం కంటే అమ్ము కోవడమే చాలా కష్టంగా మారుతోంది. మండి పోతున్న ఎండల్లోనూ పంట కుప్పల వద్దనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఎప్పుడు వర్షం కురుస్తుందోనని భయపడాల్సి వస్తోంది.  దాదాపు మండల వ్యాప్తంగా కోతలు పూర్తయ్యాయి. కానీ ప్రభుత్వ పరంగా జిల్లాలో కొనుగోలు కేంద్రాలను తెరిచేందుకు వర్షం ఎలాంటి కసరత్తు కనబడడంలేదు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యాసంగిలో జొన్న పంటను మండల వ్యాప్తంగా రైతులు అధిశంగా సాగు చేస్తారు. ఖరీప్ వచ్చిన నష్టాలను దీనితో పూడ్చుకుండామని ఆశపడతాడు. అప్పులుచేసి సాగు చేసిన రైతన్నకు అదృష్టవశాత్తూ ఈ సారి ఎకరాకు 18 నుంచి22 క్వింటాళ్లల దాకా దిగుబడి వచ్చింది. మండలంలో సుమారు 3000 ఎకరాల్లో జొన్న సాగైంది. పండించిన పంట ఖాళీ ప్రదేశాల్లో నిల్వ చేసుకున్నారు. 

ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందా అని ఎదురు చూస్తున్నారు. పక్షం రోజులు అవుతున్నా కేంద్రాలను ప్రారంభించలేదు. వర్షం వస్తే పంట నష్టపోయే ప్రమాదం ఉంది. అధికారులు స్పందించి కొనుగోళ్లు ప్రారంభించాలి. ఇదే ఆదనుగా ప్రైవేటు వ్యాపారుల దండా ఎక్కువైంది. కోసిన పంట దాచుకునే అవకాశం లేని రైతులు తమ పంటను ప్రైవేటు వ్యాపారులకు తెగనమ్ముకోవాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం జొన్న క్వింటాలుకు రూ.3200లు మద్దతు ధర ప్రకటించినా దళారులు రూ.2300 నుంచి రూ.2500 వరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో క్వించావద్ద సమారు రూ.700నుంచి 900లు రైతులు నష్టపోతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎకరాకు 14 కింటల్లో చొప్పున కొనుగోలు చేయడానికి నిర్ణయం తీసుకున్నప్పటికీ రైతులు మాత్రం ఎకరానికి 25 కింటలు ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నారు – రాజు యాదవ్ రైతు పెద్దకొడప్ గల్ 

గత సంవత్సరం కూడా ప్రభుత్వం సకాలంలో జొన్నలు కొనుగోలు చేయక చివరి క్షణంలో జొన్న కొనుగోలు ఏర్పాటు చేసింది ఆ సమయంలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు బారులు తీరడం వడగండ్ల వర్షాలు కురవడంతో లారీలు సరిపడా రాకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు కావున ఇప్పటికైనా ప్రభుత్వం త్వరగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సకాలంలో రైతుల ధాన్యాన్ని స్వీకరించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -