నవతెలంగాణ-సత్తుపల్లి
విద్య అంటే కేవలం రోటీన్ క్లాసులు వినడం, హోమ్వర్కులు రాయడమే కాదని నిరూపిస్తూ, విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసేందుకు స్థానిక సత్తుపల్లి టాలెంట్ స్కూల్లో ‘నో బ్యాగ్ డే’ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరోజు పుస్తకాల సంచుల బాధ్యత నుంచి విముక్తి పొంది, స్కూల్ ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ స్పృహను చాటుకున్నారు. అనంతరం నిర్వహించిన ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో రోజంతా ఎంతో ఉల్లాసంగా, ఆనందంగా గడిపారు. సాయంత్రం వేళల్లో విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టేలా క్విజ్ పోటీలు, వివిధ సృజనాత్మక కార్యక్రమాలు (యాక్టివిటీస్) చేపట్టారు. ఈ విధమైన వినూత్న కార్యక్రమాలు పిల్లల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపి, వారి సర్వాంగీణ (పరిపూర్ణమైన) వికాసానికి దోహదపడతాయని పాఠశాల యాజమాన్య బాధ్యులు పులి శ్రీనివాసరావు, పులి అరుణ పాఠశాల ఇంచార్జ్ రమణ శంకర్ తెలిపారు.
సత్తుపల్లి టాలెంట్ స్కూల్లో ఘనంగా ‘నో బ్యాగ్ డే’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



