Saturday, September 19, 2026
E-PAPER
Homeఖమ్మంఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శిగా పరిగడుపు లక్ష్మణ్

ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శిగా పరిగడుపు లక్ష్మణ్

- Advertisement -

నవతెలంగాణ-సత్తుపల్లి 
​ఎమ్మార్పీఎస్ సత్తుపల్లి మండల ప్రధాన కార్యదర్శిగా పరిగడుపు లక్ష్మణ్ నియమితులయ్యారు. మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు తూరుగంటి అంజయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు కూరపాటి సునీల్ సమక్షంలో ఈ నియామకం జరిగింది. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన జిల్లా నాయకులకు లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు. పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ అడుగుజాడల్లో నడుస్తూ, మాదిగ హక్కుల పోరాటంలో తనవంతు పాత్రను ఎల్లప్పుడూ పోషిస్తానని చెప్పారు. భవిష్యత్తులో ఎమ్మార్పీఎస్ ఏ పిలుపునిచ్చినా సమర్థవంతంగా అమలు చేస్తానని స్పష్టం చేశారు. మండల స్థాయిలో పార్టీని, సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని లక్ష్మణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -