Tuesday, September 22, 2026
E-PAPER
Homeసినిమామరో భిన్న ప్రేమ కథ

మరో భిన్న ప్రేమ కథ

- Advertisement -

సుగి విజయ్‌, జుప్సీ భద్ర, హారిక రాజేందర్‌ హీరో హీరోయిన్లుగా పరమేష్‌ రేణుకుంట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న విభిన్న ప్రేమకథా చిత్రం ‘ఐ హేట్‌ మ్యారేజ్‌’. ఆర్య సినిమా పతాకంపై దయానంద్‌ మాదం, కార్తీక్‌ వెంపటి నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ చివరి వారంలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని అప్పుడే పెళ్లా అనే లిరికల్‌ వీడియోను నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా బెక్కెం వేణుగోపాల్‌ మాట్లాడుతూ,’ఈ సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. ఈ సినిమా రూపొందిన విధానం నన్ను అలరించింది. కంటెంట్‌తో పాటు ఎమోషన్‌ ఉన్న సినిమా ఇది. ఈ బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరీలో యూత్‌కు మంచి సందేశం కూడా ఉంది. తప్పకుండా ఈ సినిమా థియేటర్లో సౌండ్‌ చేస్తుంది’ అని అన్నారు.
దర్శకుడు పరమేష్‌ రేణుకుంట్ల మాట్లాడుతూ,’ జెన్‌ జీ బ్యాచ్‌కు కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్‌ క్యారెక్టర్‌తో తమను తాము స్క్రీన్‌ మీద చూసుకున్న ఫీలింగ్‌ కలుగుతుంది.
చిత్రానికి స్టోరీ, స్క్రీన్‌ఫ్లే, డైలాగ్స్‌, డైరెక్షన్‌ పరమేష్‌ రేణుకుంట్ల, ఫోటోగ్రఫీ: విజయ్‌.సి.కుమార్‌, సంగీతం: వరికుప్పల యాదగిరి, ఎడిటిర్‌,ఆవుల వెంకటేష్‌, ప్రొడ్యూసర్స్‌, దయానంద్ మాదం, కార్తీక్‌ వెంపటి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -