Tuesday, September 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంతర్జాతీయ చెవిటి వారోత్సవాలపై అవగాహన

అంతర్జాతీయ చెవిటి వారోత్సవాలపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ-వనపర్తి 
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్ ఆదేశాల మేరకు వనపర్తి పరిధిలోని నాగవరం రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ చెవిటి వారోత్సవాల సందర్భంగా విద్యార్థినులకు ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

జిల్లా ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ మారుతి నందన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులకు వినికిడి లోపాలు, చెవుల ఆరోగ్య పరిరక్షణ, వినికిడి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడం, అవసరమైనప్పుడు వైద్యులను సంప్రదించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థినుల్లో ఉన్న సాధారణ ఆరోగ్య సమస్యలను గుర్తించేందుకు ఆరోగ్య స్క్రీనింగ్ నిర్వహించి, అవసరమైన వారికి తగిన ఆరోగ్య సూచనలు అందించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయలక్ష్మి గారు మరియు వైద్యాధికారి డాక్టర్ విద్యారాణి సహకరించారు.

కార్యక్రమంలో జిల్లా ఎన్‌సీడీ టీం సభ్యులు శ్రీనివాస్ కొండ, అశోక్ కుమార్, మధుమోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారుñkవినికిడి ఆరోగ్యం ప్రతి ఒక్కరి హక్కు – సమస్యను ముందుగానే గుర్తించి, సరైన సమయంలో చికిత్స పొందడం ద్వారా ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చు” అని కార్యక్రమంలో అవగాహన కల్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -